
విద్యాశాఖలో 2,397 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2021-22 కు మొత్తం 10,143 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. విద్యాశాఖ పోస్టులకు జూలై 2021 లో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో 240 లెక్చరర్ పోస్టులకు జనవరి 2022లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, మూనివర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 2022 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.