Panduranga Mahatyam Movie : అరుదైన పాత్రలో లీనమైన ‘అన్న’గారి జల్సారాయుడు కథ

నాటి సమాజానికి మాత్రమే కాదు. ఇప్పటివారికి ఈ సినిమా  ఒక సందేశంగా చెప్పుకోవచ్చు. పుండరీకులు భగవంతుడిలో లీనమయ్యే ఘట్టంలో తెలుగుతో పాటు వివిధ భాషల గీతాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి.

Written By: Chai Muchhata, Updated On : July 21, 2023 10:19 am
Follow us on

Panduranga Mahatyam Movie : నటనలో నవరసాల్ని పండించారు సీనియర్ ఎన్టీఆర్. ఎటువంటి పాత్రకైనా ప్రాణం పోసి దానికో రూపం ఇచ్చాడు. కొన్ని పాత్రల గురించి ప్రజలకు తెలియకపోయినా వాటిని ఎన్టీఆర్ రూపంలో చూసుకొని మురిసిపోయారు. పురాణాలను జల్లెడపట్టి ఎన్టీఆర్ సైతం కొత్త కొత్త పాత్రలను చేస్తూ ప్రేక్షకులు అలరించేవారు. అమాయకుడి నుంచి అతి భయంకరమైన దుర్యోధన పాత్రలో మెప్పించింది ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పుకుంటారు. అలాంటి ఎన్టీఆర్ కు ఓ అరుదైన పాత్ర చేసే అవకాశం వచ్చింది. అందులోనూ అన్నగారు లీనమైపోయారు. ఆ పాత్రకు సంబంధించిన ఫోటోనే ఇది. ఇంతకీ ఈ పిక్ విశేషాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
కొందరు డబ్బున్న వారు.. వాటిని రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.. మరికొందరు దానిని సంపాదించుకునేందుకు ఆరాటపడుతుంటారు.. మూడోరకం వ్యక్తులు మాత్రం ఉన్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇదంతా ఇప్పుడు నడుస్తున్న కథే. కానీ పూర్వకాలంలోనూ ఇటువంటి వారుండేవారు. వారసత్వంగా వచ్చిన డబ్బును జల్సాలకు ఉపయోగించి వృథా చేసేవారు. అలా చేయడం వల్ల ఎలాంటి అనార్థాలకు దారి తీస్తుంది? అనేది చెప్పేవారు. ఇటువంటి విషయాలను వెండితెరపై చూపించడం ద్వారా ప్రేక్షకులు బాగా ఆదరించేవారు. ఈ నేపథ్యంలో  1957లో వెండితెరపైకి వచ్చింది ‘పాండురంగ మహత్యం’.
సీనియర్ ఎన్టీఆర్, అంజలీదేవి, చిత్తూరు నాగయ్య, పద్మనాభం, రుష్యేంద్రమణి, సరోజాదేవి లాంటి మహామహులు నటించి ఈ మూవీని కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్ చేశారు. త్రివిక్రమరావు నిర్మించారు. సముద్రాల అనే తమిళ రచయిత ఈ కథను రచించగా.. ఘంటసాల, పీ. సుశీల, పి.లీల, చిత్తూరు నాగయ్యలు తమ గానంతో ఆకట్టుకున్నారు. 1957 నవంబర్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ ఆ సమయంలో మారుతున్న ప్రపంచం గురించి తెలుగులోకానికి చెప్పింది.
ఇందులో ఎన్టీఆర్ జల్సారాయుడిగా కనిపిస్తాడు. మహారాష్ట్రలోని పండరీపురం లోని సాంప్రదయాలను చెబుతూ.. పుండరీకుడు క్యారెక్టర్ ను రివీల్ చేశారు.  ఇక ఈ సమయంలో ఎన్టీఆర్ యంగ్ గా ఉన్నాడు. జల్సారాయుడు ఎలా ఉంటాడో ఎన్టీఆర్ పాత్రలో లీనమై పోయారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేత దర్శకుడు వివిధ ప్రయోగాలు చేయించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ గుర్రంపై కనిపిస్తూ ఆకట్టుంటాడు.  ఆ కాలంలోనే ఎన్టీఆర్ గుర్రపు స్వారీ చేస్తూ ప్రేక్షకులను అలరించేవాడు.
నాటి సమాజానికి మాత్రమే కాదు. ఇప్పటివారికి ఈ సినిమా  ఒక సందేశంగా చెప్పుకోవచ్చు. పుండరీకులు భగవంతుడిలో లీనమయ్యే ఘట్టంలో తెలుగుతో పాటు వివిధ భాషల గీతాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఘంటసాల ఆలపించిన ‘హే కృష్ణా ముకుందా మురారీ’ గీతం ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. ‘తరం తరం నిరంతరం ఈ అందం’ అనే సాంగ్ కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.