Dana Veera Sura Karna Vs Kurukshetram: అప్పటి ముచ్చట్లు: ఎన్టీఆర్ కి ఎదురెళ్లి నష్టపోయిన కృష్ణ… 1977 సంక్రాంతి బరిలో దాన వీర శూర కర్ణ-కురుక్షేత్రం!

ఒకటిన్నర కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా రామారావే కావడం విశేషం. మూడు గంటలకు పైగా నిడివి కలిగిన చిత్రం. రెండు ఇంటర్వెల్స్ వేసేవారట. అయినా ప్రేక్షకులు విసుగు లేకుండా చూశారు. 1994లో రీరిలీజ్ చేయగా మరలా భారీ వసూళ్లు అందుకుంది. కాగా ఈ చిత్రానికి ఎదురెళ్లి సూపర్ స్టార్ కృష్ణ భారీగా నష్టపోయారు.

Written By: Shiva, Updated On : July 13, 2023 7:16 pm

Dana Veera Sura Karna Vs Kurukshetram

Follow us on

Dana Veera Sura Karna Vs Kurukshetram: నందమూరి తారక రామారావు కెరీర్ లో దాన వీర శూర కర్ణ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం రామారావు ఇమేజ్ మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఎన్టీఆర్ గెటప్స్, డైలాగ్స్, సన్నివేశాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. దాన వీర శూర కర్ణ చిత్రానికి ఎన్టీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. దర్శకత్వం వహించడంతో పాటు కీలకమైన కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు చేశారు. 226 నిమిషాల నిడివి కలిగిన దాన వీర శూర కర్ణ చిత్రాన్ని ఆ రోజుల్లో రూ. 10 లక్షల బడ్జెట్ తో నిర్మించారు.

ఒకటిన్నర కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా రామారావే కావడం విశేషం. మూడు గంటలకు పైగా నిడివి కలిగిన చిత్రం. రెండు ఇంటర్వెల్స్ వేసేవారట. అయినా ప్రేక్షకులు విసుగు లేకుండా చూశారు. 1994లో రీరిలీజ్ చేయగా మరలా భారీ వసూళ్లు అందుకుంది. కాగా ఈ చిత్రానికి ఎదురెళ్లి సూపర్ స్టార్ కృష్ణ భారీగా నష్టపోయారు.

ఒక ప్రక్క ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ చిత్రం చేస్తుంటే మరో ప్రక్క అదే మహాభారతం సబ్జెక్టుతో కురుక్షేత్రం టైటిల్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కృష్ణ అర్జునుడు పాత్ర చేయగా శోభన్ బాబు కృష్ణుడు, కృష్ణంరాజు కర్ణుడు పాత్రలు చేశారు. కురుక్షేత్రం సైతం భారీ తారాగణంతో ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన కమలాకర కామేశ్వరరావు కురుక్షేత్రం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ తో ఢీ అంటే ఢీ అంటూ కురుకేత్రం చిత్రాన్ని బాక్సాఫీస్ బరిలో దించారు.

దాన వీర శూర కర్ణ, కురుక్షేత్రం 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. ఎన్టీఆర్-కృష్ణ ఫ్యాన్స్ మధ్య ఉత్కంఠ నెలకొంది. అయితే దాన వీర శూర కర్ణ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కురుక్షేత్రం మాత్రం డిజాస్టర్ అయ్యింది. కృష్ణ ఎన్టీఆర్ ముందు నిలబడలేకపోయారు. కృష్ణ అల్లూరి సీతారామరాజు మూవీ చేసిన కారణంగా ఇద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో కోల్డ్ వార్ నడిచింది. ఎన్టీఆర్ లోపాలు ఎత్తి చూపుతూ కృష్ణ అనేక సినిమాలు చేశారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక కూడా కృష్ణ ఆయన మీద సెటైరికల్ మూవీస్ చేశారు.