Homeఎంటర్టైన్మెంట్Movie Artist Association: మొన్న పావలా శ్యామల నిన్న పాకీజా నేడు ఫిష్ వెంకట్ MAA...

Movie Artist Association: మొన్న పావలా శ్యామల నిన్న పాకీజా నేడు ఫిష్ వెంకట్ MAA అసోసియేషన్ నిద్రపోతుందా?

Movie Artist Association: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(Movie Artist Association)..సినీ ఇండస్ట్రీ లో ఆర్టిస్టులను ఒక క్రమ శిక్షణ లో పెట్టడం కోసం, సినీ ఇండస్ట్రీ ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం, పేద ఆర్టిస్టులను, సినీ కార్మికులను ఆదుకోవడం కోసం పుట్టిన సంస్థ ఇది. ఎంతోమంది మహానుభావులు ఈ అసోసియేషన్ కి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మోహన్ బాబు(Manchu Mohan Babu) తనయుడు, మంచు విష్ణు(Manchu Vishnu) ఈ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మంచు విష్ణు ప్రెసిడెంట్ అయ్యాక చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి?, మా అసోసియేషన్ కోసం ఒక అందమైన భవనం నిర్మిస్తాను అని అప్పట్లో ఓట్ల కోసం విష్ణు పెద్ద హంగామా చేసాడు, ఆ కార్యక్రమం ఎంత వరకు వచ్చింది?, ఇప్పటి వరకు మా అసోసియేషన్ ద్వారా ఎంత మంది పేద ఆర్టిస్టులు సహాయం అందుకున్నారు? అనేది మంచు విష్ణు లిస్ట్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది.

Read Also: బంగారం కొనుగోలుదారులకు షాక్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

సీనియర్ నటి పావలా శ్యామల గుర్తుంది కదా?, ఎన్నో వందల సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు గా నటించిన ఈమె, ప్రస్తుతం సినిమాలు లేక అనారోగ్యం తో ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఆర్ధిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఆమెకి ఆర్ధిక సాయం అందించాడు. ఆ తర్వాత మెగా కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సాయి ధరమ్ తేజ్(Sai Durg Tej) లు ఆర్ధికసాయం చేశారు. కానీ మా అసోసియేషన్ నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. నిన్న గాక మొన్న మోహన్ బాబు ఇండస్ట్రీ హిట్ ‘పెద్ద రాయుడు’ చిత్రం లో ‘పాకీజా’ అనే పాపులర్ క్యారక్టర్ చేసిన వాసుకి తనకు ఆర్ధిక సాయం చేయండి అంటూ గుండెలు బాదుకుని ఏడ్చిన ఘటన మన చేత కంటతడి పెట్టించేలా చేసింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, మంగళగిరి కి పిలిపించి నిన్ననే రెండు లక్షల రూపాయిల చెక్ ని పార్టీ తరుపున అందించాడు.

కానీ మా అసోసియేషన్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇక పాపులర్ నటుడు ఫిష్ వెంకట్ సంగతి.సరే సరి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించిన నటుడు ఈయన. గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం అయ్యాడు. ఆర్ధిక పరిస్థితి క్షీణించింది. అయినప్పటికీ అతను ఒకరిని చెయ్యి చాచి నాకు సహాయం చేయండి అని అడగలేదు. కానీ ఇతని పరిస్థితి తెలుసుకొని చిరంజీవి,రామ్ చరణ్(Global Star Ram Charan) తొలుత ఆర్ధిక సాయం అందించారు. ఆ తర్వాత రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కూడా భారీ ఆర్ధిక సాయం చేసాడు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. రెండు కిడ్నేలు చెడిపోయి వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. కనీసం ఇప్పటికైనా మా అసోసియేషన్ నిద్రలో నుండి మేలుకుంటుందా?, ఫిష్ వెంకట్ కి సాయం చేస్తుందా?, తన కన్నప్ప చిత్రాన్ని కాపాడుకోవడం కోసం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పవర్ తో రివ్యూస్ కూడా బయటకు రానివ్వకుండా చేసిన మంచు విష్ణు,ఈ ఒక్క విషయంలో అయినా స్పందించి, ఫిష్ వెంకట్ ని ఆదుకునేందుకు తన ప్రెసిడెంట్ పవర్ ని చూపిస్తే చూడాలని ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసున్నారు.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version