కత్తి మహేష్ మరణానికి కారణమేమిటి?

సినీ విమర్శకుడు, దర్శకుడు, నటుడు, సామాజిక కార్యకర్త, మృదుస్వభావి కత్తి మహేష్ మరణంతో సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు విషాదంలో మునిగిపోయారు. ఇటీవల నెల్లూరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో మొదట నెల్లూరు, తరువాత చెన్నై ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నట్టే కనిపించినా చివరికి మరణించడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. కత్తి మహేష్ జూన్ 26న తెల్లవారు జామున నెల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో […]

Written By: Srinivas, Updated On : July 12, 2021 10:43 am
Follow us on

సినీ విమర్శకుడు, దర్శకుడు, నటుడు, సామాజిక కార్యకర్త, మృదుస్వభావి కత్తి మహేష్ మరణంతో సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు విషాదంలో మునిగిపోయారు. ఇటీవల నెల్లూరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో మొదట నెల్లూరు, తరువాత చెన్నై ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నట్టే కనిపించినా చివరికి మరణించడంపై జీర్ణించుకోలేకపోతున్నారు.

కత్తి మహేష్ జూన్ 26న తెల్లవారు జామున నెల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆయనను నెల్లూరు హాస్పిటల్ కు నాలుగు గంటల ప్రాంతంలో తరలించారు. అప్పటికే విపరీతమైన రక్తస్రావం జరిగిందని సన్నిహితులు తెలిపారు. నెల్లూరు ఆస్పత్రిలో వైద్యులు ప్రాథమికంగా చికిత్స నిర్వహించిన తరువాత వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితి వివరించారు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలాయి. గాయాలే కాకుండా తలలో పలు చోట్ల గాయాలు కనిపించాయి. ఓ కన్నుకు తీవ్రంగా గాయమైంది. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండడంతో ఆయనను వెంటిలేటర్ పైకి తరలించామని వైద్యులు వెల్లడించారు.

మెరుగైన చికిత్స కోసం కత్తి మహేష్ ను హాస్పిటల్ కు తరలించిన తరువాత ఆయన శరీరంలో పలు రకాల సమస్యలు వెలుగు చూశాయని స్నేహితులు తెలిపారు. ఇటీవల ఆయన ఊపిరితిత్తుల్లోరక్తం గడ్డ కట్టడం (పల్ మనరీ ఎంబోలిజం) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సమస్యను పరిష్కరించే దిశగా వైద్యులు చికిత్స ప్రారంభించారు. సమస్య జఠిలం కావడంతో శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల సమస్య ఉత్పన్నం అవుతుంది. గడ్డ కట్టిన నాళాలు ఊపిరితిత్తుల నుంచి కాళ్లు లేదా దేహంలోని ఇతర అవయవాల్లోకి రక్త నాళాలకు వ్యాపిస్తాయి. రక్త సరఫరా స్తంభిస్తుంది. దీంతో మనిషి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. మహేష్ మరణానికి గల కారణాలు పోస్టుమార్టమ్ రిపోర్టులో వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

గత కొద్ది రోజులుగా మహేష్ ఆరోగ్యం మెరుగుపడినట్లు కనిపించింది. కోలుకుని అందరి విమర్శలకు తగిన సమాధానం చెబుతారని స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో ఆయన ఆకస్మిక మరణం బాధించిందని చెబుతున్నారు. ఆయన అభిమానించే ప్రతి ఒక్కరు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.