Homeఎంటర్టైన్మెంట్Mouni Roy : షర్ట్ మొత్తం విప్పేసిన నటి.. మరీ ఇలా కనిపిస్తే ఎలా?

Mouni Roy : షర్ట్ మొత్తం విప్పేసిన నటి.. మరీ ఇలా కనిపిస్తే ఎలా?

Mouni Roy

Mouni Roy : గ‌తంలో నటీన‌టులకు – ఫ్యాన్స్ కు మ‌ధ్య చాలా దూరం ఉండేది. కానీ.. సోషల్ మీడియా రాకతో హ‌ద్దుల‌న్నీ చెరిగిపోయాయి. ఏకంగా త‌మ అభిమాన న‌టుల‌తో చాటింగ్ చేసే ప‌రిస్థితి వ‌చ్చేసింది. అయితే.. వెండి తెర అయినా.. బుల్లి తెర‌పైనా హీరోయిన్ లైఫ్ టైమ్‌ చాలా త‌క్కువ. ఆ త‌ర్వాత ఏ సైడ్ క్యారెక్ట‌ర్లకో షిఫ్ట్ అయిపోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి.. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న‌ట్టుగా.. సాధ్య‌మైనంత వేగంగా నాలుగు అవ‌కాశాలు ద‌క్కించుకోవాలి.. నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాలి. మ‌రి, ఇది జ‌ర‌గాలంటే ఏం కావాలీ? క్రేజ్ పెంచుకోవాలి. దీనికోసం సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడేస్తున్నారు నటీమణులు. కొంద‌రు పరువాలను ఆర‌బోస్తుంటే.. మ‌రికొంద‌రు ఏకంగా పార‌బోస్తున్నారు. ఏం చేసైనా ఫేమ‌స్ అవ్వ‌డ‌మే ల‌క్ష్యంగా ఒంపు సొంపుల‌తో యువ‌త మీద దాడిచేస్తున్నారు.

మౌనీ రాయ్‌.. ద‌క్షిణాది ఆడియ‌న్స్ కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోవొచ్చేమోగానీ.. హిందీ బుల్లితెర‌ను ఫాలో అయ్యే వారికి, సోష‌ల్ మీడియాలో టైమ్ గ‌డిపేసే వాళ్ల‌కు ఫేమ‌స్ ఫిగ‌రే. ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ తో మాంచి కెమిస్ట్రీని పండించే ఈ ముద్దుగుమ్మ.. తొలుత మోడ‌లింగ్ లోకి అడుగు పెట్టింది. ప‌లు బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్ గా ఉన్న బ్యూటీ.. ఎన్నో అందాల పోటీల్లో త‌న కెపాసిటీ ఏంటో చూపించింది. అలా అలా.. ఎదుగిన ఈ ముద్దుగుమ్మ 2006లో హిందీ సీరియ‌ల్ రంగంలోకి ప్ర‌వేశించింది. ‘క్యూకీ సాస్ బీ క‌బీ బ‌హు తీ’ అనే సీరియల్ తో ఎంట్రీఇచ్చిన మౌనీ రాయ్‌.. ఆ సీరియ‌ల్ బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో తిరుగులేకుండా పోయింది.

అందం.. అభిన‌యం క‌ల‌గ‌లిసిన మౌనీ రాయ్ ను అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌చ్చాయి. క‌స్తూరి, క‌సో నా యార్ హై, దేవాన్ కే దేవ్ మ‌హాదేవ్‌, దో స‌హేలియాన్ వంటి ఎన్నో సూప‌ర్ హిట్ సీరియ‌ల్స్ లో న‌టించి, స‌త్తా చాటింది. తెలుగులో కూడా డ‌బ్ అయిన ‘నాగినీ’ సీరియల్ లోనూ నాగకన్య పాత్రలో అదరగొట్టింది. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి, తనదైన నటనతో ఆకట్టుకుంది. మొదట్లో ఐట‌మ్ సాంగ్స్ మాత్ర‌మే చేసిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత పంజాబీలో హీరోయిన్ గా న‌టించింది. బాలీవుడ్ లోనూ ప‌లు చిత్రాల్లో ఆక‌ట్టుకుంది. ఆ విధంగా నేష‌న‌ల్ ఫిగ‌ర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే.. అదేదో సినిమాలో ‘‘స‌క్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేష‌న్.. ఇట్స్ ఏ జర్నీ’’ అన్న మాటను పక్కాగా అప్లై చేసుకుంటోందీ భామ. పాపులారిటీ కూడా ఓ జ‌ర్నీ లాంటిది అని భావిస్తోందో ఏమోగానీ.. ఇప్ప‌టికీ అందాల‌ను ఆర‌బోస్తూ.. యువ‌త‌ను క‌వ్విస్తోంది. హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ.. వీడియోల‌ను షేర్ చేస్తూ పోర‌గాళ్ల మ‌తులు పోగొడుతోంది.

తాజాగా.. త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ప‌లు హాట్ ఫొటోల‌ను షేర్ చేసింది. ఇందులో ష‌ర్ట్ బ‌ట‌న్స్ మొత్తం విప్పేసింది మౌనీరాయ్‌. లో దుస్తులు కూడా లేకుండా.. ఎద అందాల‌తో రెచ్చ గొడుతోంది. ఈ ఫొటోల‌కు నెటిజ‌న్ల‌ను భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. లైకుల వ‌ర్షం కురుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version