Tollywood Updates 05.09.2021 : నేటి సినిమా ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ !

Tollywood Updates: టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. సురేందర్ రెడ్డి టేకింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. అందుకే హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మొత్తానికి నితిన్, వరుణ్ తేజ్ కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాకపోతే పవన్ సినిమా పూర్తి చేసిన తరువాతనే ఈ సినిమా స్టార్ట్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) క్రేజ్ రీమేక్ ‘గాడ్‌ ఫాదర్‌’ (God […]

Written By: admin, Updated On : September 5, 2021 11:54 am
Follow us on

Tollywood Updates: టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. సురేందర్ రెడ్డి టేకింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. అందుకే హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మొత్తానికి నితిన్, వరుణ్ తేజ్ కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాకపోతే పవన్ సినిమా పూర్తి చేసిన తరువాతనే ఈ సినిమా స్టార్ట్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) క్రేజ్ రీమేక్ ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) సినిమాలో మరో స్టార్ నటించబోతున్నాడు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే అధికారిక అప్ డేట్ రానుంది.

ఆకాశ్ పూరి హీరోగా రానున్న ‘రొమాంటిక్’ సినిమా ఓటీటీలో రాబోతుంది అని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లోనే విడుదల కాబోతుంది. సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తి అయింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఆకాశ్ పూరి జోడీగా కేతిక శర్మ నటిస్తోంది.

నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా కూడా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాని దసరా స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ రాబోతుంది. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.

సందీప్ కిషన్ హీరోగా వస్తోన్న ‘గల్లీ రౌడీ’ సినిమా అవుట్ ఫుట్ బాగాలేదు అని టాక్ నడుస్తోంది. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ ను పలు సార్లు పోస్ట్ ఫోన్ చేశారని రూమర్స్ మొదలయ్యాయి. అయితే, ఈ రూమర్స్ లో కొన్ని నిజాలు ఉన్నాయి.