Homeక్రీడలుGautam Gambhir : బీసీసీఐ తదుపరి ప్లాన్.. గంభీర్ పోస్ట్ ఊస్టేనా..

Gautam Gambhir : బీసీసీఐ తదుపరి ప్లాన్.. గంభీర్ పోస్ట్ ఊస్టేనా..

Gautam Gambhir : ఐరిష్ సిరీస్ వైట్ వాష్ అయింది. ఇది కలలో కూడా ఊహించలేదు. ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ కోల్పోయింది. ఇది కూడా కలలో ఊహించలేదు. పైగా దారుణమైన ఓటములు ఎదురయ్యాయి. ఇది కూడా కలలో ఊహించలేదు. ఇన్ని ఉపద్రవాలు.. ఇన్ని ఇబ్బందులు ఇటీవల కాలంలో టీమిండియా ఎన్నడూ చూడలేదు. పైగా వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా కు తిరుగులేదు. అటువంటి జట్టు ఇబ్బంది పడడం.. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ఓడిపోవడం సగటు భారత క్రికెట్ అభిమానిని కలవర పాటుకు గురి చేస్తోంది.

గతంలో ఏదైనా ఓటమి ఎదురైనప్పుడు.. వెంటనే జట్టు తేరుకునేది. సూపర్ ఆట తీరుతో ఆకట్టుకునేది. పోరాటాన్ని కొనసాగించి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేది. అందువల్లే టీమిండియా 2024.. 2026 లో పొట్టి ప్రపంచ కప్ లు అందుకుంది. అటువంటి స్థాయి ఉన్న జట్టు ఇప్పుడు అనామకమైన జట్ల చేతిలో ఓడిపోతోంది. జట్టు ఇలా ఓడిపోవడాన్ని మేనేజ్మెంట్ ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ఆటగాళ్ల ఆట తీరు.. కోచ్ గంభీర్ వ్యవహార శైలి మీద తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన అసంతృప్తిలో బీసీసీఐ కనిపిస్తోంది.. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తుది జట్టు ఎంపికలో గౌతమ్ గంభీర్ వేలు పెడుతూ ఇష్టానుసారంగా ప్లేయర్లను మార్చేస్తున్నాడు. ఇది కెప్టెన్ శ్రేయస్ ను గందరగోళానికి గురిచేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జట్టు మీద అయ్యర్ పట్టు సాధించ లేకపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందువల్లే టీం ఇండియా కనివిని ఎరుగని రేతులో రెండు వరుస సిరీస్ లను కోల్పోయింది.

జట్టు ఇలా ఓడిపోవడం పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్ర అసహనంతో కనిపిస్తోంది. అయ్యర్ మీద.. గంభీర్ మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమ్ ఇండియా స్వదేశానికి రాగానే.. కాయకల్ప చికిత్స ఉంటుందని.. కచ్చితంగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. గంభీర్ శిక్షణలో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. రెడ్ బాల్ ఫార్మాట్ లో ఇప్పటికే జట్టు అట్టర్ ప్లాఫ్ అయింది. ఇప్పుడు ఆ దరిద్రం వైట్ బాల్ ఫార్మాట్ వరకు వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే టీమిండియా కొంప ముగిపోతుంది. కొంతకాలం పాటు క్రికెట్ మీద పెత్తనం సాగిస్తున్న టీమిండియా.. తన ప్రభను కచ్చితంగా కోల్పోతుంది.

అక్కడిదాకా పరిస్థితి రావద్దు అనుకుంటే.. టీమిండియా మెరుగైన స్థితిలో ఉండాలి అనుకుంటే.. కచ్చితంగా మార్పులు జరగాలి. ఒకప్పటి మాదిరిగా జట్టు ఉండాలి. అద్భుతమైన ఆట తీరు కొనసాగించాలి. ప్లేయర్లలో క్రీడా స్ఫూర్తి కనిపించాలి. ప్లేయర్లను పదేపదే మార్చకూడదు. సారథి విషయంలో కూడా మేనేజ్మెంట్ మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ముఖ్యంగా జట్టు కోచ్ కు అధికారాలను కొంత మేరకు మాత్రమే పరిమితం చేయాలి. అప్పుడు మాత్రమే క్రికెట్లో ఒకప్పటి పెత్తనాన్ని టీమిండియా అందుకుంటుంది. లేకపోతే అంతే సంగతులు.


 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version