Most Popular Heroes: పాన్ ఇండియా కాన్సెప్ట్ ప్రాచుర్యం పొందాక భాష, ప్రాంతీయ బేధాలు చెరిగిపోయాయి. ముఖ్యంగా సౌత్ హీరోలు నార్త్ లో సత్తా చాటుతున్నారు. అక్కడి ప్రేక్షకుల నుండి ఆదరణ రాబడుతున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగింది. వందలు, వేల కోట్ల బడ్జెట్ తో చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్(PRABHAS), అల్లు అర్జున్(ALLU ARJUN), ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనూహ్యంగా ఒకప్పుడు ఇండియన్ సినిమాను ఏలిన సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్ రేసులో వెనుకబడ్డారు. ప్రముఖ మీడియా సంస్థ దేశంలోనే నెంబర్ వన్ హీరో ఎవరో తేల్చేసింది. ఈ సర్వేలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి.
Also Read: ఇప్పటికీ వైసీపీ నేతలే.. చేతికి ‘ఇసుక’ అంటకుండా!
ఆర్మాక్స్ సంస్థ 2025 మే కి గాను మోస్ట్ పాప్యులర్ హీరోస్ ఇన్ ఇండియా(MOST POPULAR HEROES IN INDIA) పేరుతో సర్వే విడుదల చేసింది. ఆ సర్వే ప్రకారం టాప్ 10 హీరోల లిస్ట్ ఈ విధంగా ఉంది. ఒక్క హిట్ అంటూ అల్లాడుతున్న సల్మాన్ ఖాన్ 10వ స్థానానికి పడిపోయారు. గతంలో ఆయన టాప్ ఫైవ్ లో ఉన్నారు. సల్మాన్ కంటే అక్షయ్ కుమార్ మెరుగైన ర్యాంక్ సాధించడం విశేషం. ఆయన లేటెస్ట్ మూవీ హౌస్ ఫుల్ 5 ఒకింత ఆదరణ రాబట్టింది. అక్షయ్ 9వ స్థానంలో నిలిచాడు.
8వ స్థానంలో రామ్ చరణ్(RAM CHARAN) ఉన్నారు. గతంలో ఆయన ఆరు, ఏడు స్థానాల్లో ఉండేవారు. ఇక 7వ స్థానం ఎన్టీఆర్ కి దక్కింది. ఎన్టీఆర్ ర్యాంక్ సైతం లేటెస్ట్ సర్వేలో కిందకు పడిపోయింది. గతంలో ఆయన టాప్ 5లో ఉన్నారు. ఎన్టీఆర్(NTR) కి టాప్ ఫైవ్ చేజారింది. ఆర్ ఆర్ ఆర్ హీరోల ర్యాంక్స్ పడిపోగా, వారిద్దరికీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. 6వ స్థానంలో మరో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. మహేష్ బాబు తన ర్యాంక్ ని మెరుగు పరుచుకోవడం విశేషం. గతంలో ఆయన ఎన్టీఆర్ కంటే తక్కువ ర్యాంక్ లో ఉన్నారు. రాజమౌళితో మూవీ చేస్తున్న క్రమంలో మహేష్ బాబు పేరు ఇండియా వైడ్ వినిపిస్తుంది.
అనూహ్యంగా అజిత్ కి టాప్ 5లో చోటు దక్కింది. 5వ స్థానంలో ఆయన నిలిచారు. ఆయన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇక 4వ స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. పుష్ప 2 సంచలన విజయం సాధించినప్పటికీ అల్లు అర్జున్ ర్యాంక్ పడిపోయింది. గతంలో ఆయన టాప్ 3లో ఉన్నారు. 3వ స్థానంలో షారుక్ నిలిచాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ 2వ స్థానం పొందారు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకపోయినా విజయ్ ఇతర హీరోలను డామినేట్ చేయడం విశేషం. ఇక నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఆర్మాక్స్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న హీరోగా ప్రభాస్ నిలిచాడు.
సోర్స్: ఆర్మాక్స్ మీడియా సర్వే
Ormax Stars India Loves: Most popular male film stars in India (May 2025) #OrmaxSIL pic.twitter.com/yrHUwdaK6H
— Ormax Media (@OrmaxMedia) June 20, 2025