Celebrity weddings: భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ- భార్య నీతా చిన్న కుమారుడు అనంత్ అంబానీ జూలై 12, 2024న రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. వీరి మాదిరి మరికొందరు కూడా వివాహానాకి భారీగా ఖర్చు చేశారు. వారెవరంటే..
ఇషా అంబానీ- ఆనంద్ పిరమల్: INR 700 కోట్లు ముఖేష్, నీతా అంబానీల ఏకైక కుమార్తె, ఇషా అంబానీ ఆనంద్ పిరమల్‌ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నారు. INR 90 కోట్ల విలువైన లెహంగా ధరించడం నుంచి ఒక్కొక్కరికి INR 3 లక్షల విలువైన ఆహ్వానాలను పంపడం వరకు, సుమారు INR 700 కోట్లు ఖర్చు చేశారు.
సుశాంతో రాయ్-రిచా అహుజా-సీమాంటో రాయ్-చంటిని టూర్: INR 554 కోట్లు: వ్యాపారవేత్త దివంగత సుబ్రతా రాయ్ కుమారులు– సుశాంత్ రాయ్, సీమాంటో రాయ్– 2004లో జరిగిన డబుల్ వెడ్డింగ్ ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భారతీయ వివాహాలలో ఒకటి.
బ్రాహ్మణి రెడ్డి- రాజీవ్ రెడ్డి: INR 500 కోట్లు: మైనింగ్ మాగ్నెట్, మాజీ రాజకీయ నాయకుడు, గాలి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రహ్మణి రెడ్డి 2016లో రాజీవ్ రెడ్డిని గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ వివాహానికి 50,000 మంది అతిథులు హాజరయ్యారు.
సృష్టి మిట్టల్- గుల్రాజ్ బెహ్ల్: INR 500 కోట్లు: స్టీల్ టైకూన్ ప్రమోద్ మిట్టల్ కుమార్తె సృష్టి మిట్టల్ 2013లో స్పెయిన్‌లో మూడు రోజుల వివాహ వేడుకలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన గుల్‌రాజ్ బెహ్ల్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి ఖర్చు మొత్తం దాదాపు 500 కోట్ల రూపాయలు.
వనీషా మిట్టల్- అమిత్ భాటియా: INR 240 కోట్లు: ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా లండన్ బ్యాంకర్ అయిన అమిత్ భాటియాను 2004లో వివాహం చేసుకున్నారు. వీరి ఆరు రోజుల వివాహ వేడుకలు పారిస్‌లో జరిగాయి. మొత్తం ఈవెంట్‌కు 240 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయింది.
సంజయ్ హిందుజా-అను మహతానీ: INR 150 కోట్లు: 2015లో, వ్యాపారవేత్త సంజయ్ హిందుజా తన చిరకాల స్నేహితురాలు అను మహతానిని ఉదయపూర్‌లో దాదాపు 140 కోట్ల రూపాయలతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ: INR 100 కోట్లు: 2017లో ఇటలీలోని లేక్ కోమోలో భారత ఏస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరి వివాహానికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది.