శుభాకాంక్షలతో ‘మోసగాళ్లు’ న్యూ పోస్టర్

మంచు మోహన్ బాబు అనేక అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల మనసులలో చిరకాలం గుర్తుండిపోయే గొప్ప సినిమాలు చేశారు. ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన వారసులు విష్ణు, మనోజ్ ఇద్దరు కూడా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి తండ్రి పేరుని నిలబెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. విష్ణులో అన్నీ ఉన్నా ఆయన ఎంచుకునే కథలే మైనస్ అవుతున్నాయి. తాజాగా ఆయన ఒక సరికొత్త కథతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. Also Read: అల్లుడు అదుర్స్ రివ్యూ : […]

Written By: admin, Updated On : January 15, 2021 10:40 am
Follow us on


మంచు మోహన్ బాబు అనేక అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల మనసులలో చిరకాలం గుర్తుండిపోయే గొప్ప సినిమాలు చేశారు. ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన వారసులు విష్ణు, మనోజ్ ఇద్దరు కూడా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి తండ్రి పేరుని నిలబెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. విష్ణులో అన్నీ ఉన్నా ఆయన ఎంచుకునే కథలే మైనస్ అవుతున్నాయి. తాజాగా ఆయన ఒక సరికొత్త కథతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు.

Also Read: అల్లుడు అదుర్స్ రివ్యూ : రెగ్యులర్ సినిమాల సమ్మేళనం !

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోసగాళ్లు’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇటీవల విడుద‌లయిన చిత్ర టీజ‌ర్ ని చూస్తే స్కామ్ ఎవరు, ఎందుకు, ఎలా చేశారన్నది ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లుగా అర్ధమవుతుంది. దీనితో ఈ మూవీ మీద ప్రేక్షకులలో అంచనాలు బాగానే పెరిగాయి.

Also Read: టీజర్ టాక్: రీఎంట్రీలో ‘వకీల్ సాబ్’ అదరగొట్టేశాడు

తాజాగా సంక్రాంతి సందర్భంగా మోసగాళ్లు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మరో పోస్టర్ కూడా అభిమానులని ఆకట్టుకుంటుంది. కాజల్‌ అగర్వాల్‌, సునీల్‌శెట్టి, నవదీప్‌, నవీన్‌చంద్ర, రుహీసింగ్‌ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అనేక తెలుగు, తమిళ చిత్రాలకి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన సామ్ సి.ఎస్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్ పై ఈ చిత్రాన్ని మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్