https://oktelugu.com/

Daku Maharaj : ‘డాకు మహారాజ్’ కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఎక్కువ క్రేజ్..అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!

ఈ సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న అన్ని సినిమాలలో 'గేమ్ చేంజర్' చిత్రానికి ఎక్కువ క్రేజ్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : January 7, 2025 / 04:48 PM IST

    Daku Maharaj

    Follow us on

    Daku Maharaj : ఈ సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న అన్ని సినిమాలలో ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఎక్కువ క్రేజ్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. #RRR తర్వాత రామ్ చరణ్ హీరో గా నటించిన చిత్రం. అంతే కాకుండా శంకర్ లాంటి టాప్ మోస్ట్ డైరెక్టర్ తెలుగు లో దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా. టీజర్, ట్రైలర్,పాటలు ఇలా అన్నీ కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలను పెంచేలా చేసాయి. వింటేజ్ శంకర్ కం బ్యాక్ ఈ చిత్రం ద్వారానే జరుగుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు అభిమానులు. ఈ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే ఈ చిత్రం తో పాటుగా బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. బాలయ్య వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. కాబట్టి వెంకటేష్ మీద ఆయనదే పై చెయ్యి అని అందరూ అనుకున్నారు.

    కానీ సీన్ రివర్స్ అయ్యింది. ట్రేడ్ సర్కిల్స్ లో ‘డాకు మహారాజ్’ చిత్రం కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికే ఎక్కువ డిమాండ్ ఉంది. ‘గేమ్ చేంజర్’ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో B,C సెంటర్స్ లో వెంకటేష్ సినిమాని కొనేందుకే అమితాసక్తిని చూపిస్తున్నారు బయ్యర్స్. ‘డాకు మహారాజ్’ చిత్రం లోని పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఎందుకో ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు. రీసెంట్ గా విడుదలైన ‘దబిడి దిబిడి’ పాటకు పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులపై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కానీ విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోని పాటలకు ‘గేమ్ చేంజర్’ కి మించిన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. అందుకే ఆడియన్స్ ఎక్కువగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ వైపే మొగ్గు చూపిస్తున్నారు.

    ఈ సినిమా కెపాసిటీ కేవలం ‘డాకు మహారాజ్’ ని డామినేట్ చేయడమే కాదు, ‘గేమ్ చేంజర్’ కి పొరపాటున ఫ్లాప్ టాక్ వస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రమే ఆడియన్స్ కి మొదటి ఛాయస్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ జాతర కి వెళ్లినట్టు థియేటర్స్ కి వెళ్తారు. ఆ రేంజ్ సత్తా ఉన్న చిత్రమిది. బుక్ మై షో, పేటీఎం వంటి టికెట్ బుకింగ్ పోర్టల్ యాప్స్ లో కూడా ‘డాకు మహారాజ్’ చిత్రం కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న సమాచారాల ప్రకారం చూస్తే ‘గేమ్ చేంజర్’ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ఉండగా, ఆ తర్వాతి స్థానం లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికే మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. ‘డాకు మహారాజ్’ చిత్రానికి ఫస్ట్ హాఫ్ వరకు మంచి రిపోర్ట్స్ ఉన్నాయి కానీ, సెకండ్ హాఫ్ మీద అనుకున్న స్థాయిలో మంచి రిపోర్ట్స్ లేవు. మరి ఇవి ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.