Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కర్ణాటక లో నిన్ననే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై నెల రోజులైంది. నిన్నటితో ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని దేశాల్లోనూ పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి. నార్త్ అమెరికా బుకింగ్స్ కూడా నిన్న రాత్రి నుండి నిదానంగా అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో మొదలు పెట్టారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి 1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐమాక్స్ షోస్ ని ఇప్పటి వరకు షెడ్యూల్ చేయకపోవడం వల్లే రెండు మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ ని రాబట్టాల్సిన సినిమా కేవలం 1.5 మిలియన్ దగ్గర ఆగిపోయింది.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించి ఒక స్పెషల్ షో ని దిల్ రాజు కొంతమంది సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా వేసి చూపించబోతున్నారట. మూవీ టీం తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి వంటి వారికి కూడా ఆహ్వానం దొరికినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ కి తెలంగాణ లో టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ రప్పించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆయన సమావేశం అవ్వబోతున్నడు. కాసేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రీమియర్ షోస్ ఉండే ఛాన్స్ లేదు కానీ, బెనిఫిట్ షోస్ మాత్రం ఉండొచ్చు. అయితే దిల్ రాజు ఈ స్పెషల్ స్క్రీన్ కేవలం తన వ్యక్తిగతంగా ప్రసాద్ ల్యాబ్స్ లో చూడబోతున్నాడట.
అందుకోసం మూవీ టీం తో పాటు మహేష్, రాజమౌళి వంటి వారు కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి రాబోతున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు తన తోటి హీరోల సినిమాలు బాగుంటే, మనస్ఫూర్తిగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందించి వాళ్లకు శుభాకాంక్షలు తెలియచేస్తాడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలకు గతంలో ఆయన అద్భుతమైన పాజిటివ్ రివ్యూస్ కూడా అందించాడు. అయితే ఈమధ్య కాలం లో ఆయన అలాంటి రివ్యూస్ ఇవ్వడం బాగా తగ్గించేసాడు. దేవర, పుష్ప 2 చిత్రాలకు ఆయన నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి రివ్యూ ఇవ్వబోతున్నాడా లేదా అనేది చూడాలి. ఇకపోతే నేడు మూవీ టీం చెన్నై లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.