https://oktelugu.com/

Doctor Dog: డాక్టర్లే కాదు.. వాళ్ళు పెంచుకునే శునకాలు వైద్యం చేస్తాయి.. వైరల్ వీడియో

పోలీసోడే కాదు.. వాళ్ల చేతిలో ఉండే లాఠీ కూడా డ్యూటీ చేస్తది.. విక్రమార్కుడు సినిమాలో రవితేజ పలికే డైలాగ్ ఇది. సేమ్ ఆ డైలాగ్ మాదిరిగానే కుక్కలు వ్యవహరిస్తున్నాయి. ఏకంగా తమ యజమానులు చెప్పింది చేస్తున్నాయి. కుక్కలు యజమాని చెప్పినట్టే చేస్తాయి కదా.. అని మీకు అనుమానం రావచ్చు.. గపోతే ఇక్కడ యజమాని స్థానంలో డాక్టర్ అని మీరు చదువుకోవాలి.

Written By:
  • Bhaskar
  • , Updated On : January 7, 2025 / 04:36 PM IST

    Doctor Dog

    Follow us on

    Doctor Dog: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రకరకాల యాప్స్ మన జీవితంతో ముడి వేసుకున్న తర్వాత కొత్త కొత్త వీడియోలు కనిపిస్తున్నాయి.. అవి సంచలనాల మీద సంచలనాలను సృష్టిస్తున్నాయి. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే
    .. ఓ వ్యక్తి అకస్మాత్తుగా కింద పడిపోతాడు. దీంతో అక్కడే ఉన్న ఒక్కొక్క వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అతడి శ్వాసను పరిశీలిస్తుంది. కాళ్లు, చేతులను పట్టుకొని చూస్తుంది. ఆ తర్వాత అటు ఇటు తిరిగి.. చాతి పైభాగంలోకి ఎక్కుతుంది. తన మొదటి రెండు కాళ్ళతో ఛాతి భాగంలో రుద్దుతుంది. సేమ్ అచ్చం ప్రమాద సమయంలో.. డాక్టర్ చేసినట్టుగానే చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆ కుక్క పై అభినందనల జల్లు కురుస్తోంది. ఆపత్కాలంలో వైద్యులు చేసినట్టుగానే చేసిందని.. నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు..

    అది డాక్టర్ శునకం

    సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియోలో ఉన్న శునకాన్ని ఓ డాక్టర్ పెంచుకుంటున్నాడు. అతడు రోగులకు ఎలాగైతే చికిత్స చేస్తాడో.. అలాంటి పద్ధతులనే ఆ శునకానికి నేర్పుతున్నాడు. అది కూడా ఆ డాక్టర్ చెప్పినట్టుగానే చేస్తోంది. ఆపదలో ఉన్న వారి దగ్గరికి వెంటనే వెళ్తోంది. అయితే తన కుక్క ఎంతటి పనిమంతురాలో తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించారు.. ఇందులో భాగంగా అకస్మాత్తుగా తనకు అనారోగ్యం సోకినట్టు.. వెంటనే కింద పడిపోయినట్టు నటించారు.. ఆయన పెంచుకున్న శునకం వెంటనే అక్కడికి వచ్చింది. ఆయన పైకెక్కింది. చికిత్స చేయడం మొదలుపెట్టింది. తన శునకం అచ్చం తనలా చేయడంతో ఆయన ఉబ్బి తబ్బిబ్బయారు. ఇదే విషయాన్ని ఆయన పంచుకున్నారు. ” నేను పెంచుకున్న శునకం ఇలా చేస్తోంది. రకరకాల పనులు మాత్రమే కాదు, నా లాగే వైద్య చికిత్స చేస్తోంది. అది మామూలు శునకం కాదు. విశ్వాసానికి ప్రతీక లాగా కనిపిస్తోంది. ఇది గొప్ప కుక్క కాదు. విశ్వాసాన్ని పెంపొందించుకున్న జంతువని” ఆయన పేర్కొన్నారు. ఈ కుక్క ట్రీట్ మెంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ” కుక్క భలే ఉంది. సూపర్ యాక్టివ్ గా ఉంది. పోయిన జన్మ లో డాక్టర్ అయి ఉంటుంది. అందు వల్లే అది గొప్పగా ఉంది. ఉత్సాహంగా కనిపిస్తోంది. ఆపదలోన మనిషికి ఏదో చేయాలని ప్రయత్నం దానిలో కనిపిస్తోంది.. అందువల్లే అది మరో డాక్టర్ అయింది. ఇందరి మన్ననలూ పొందుతోందని” నెటిజన్లు చెబుతున్నారు.