Samantha: స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ వస్తే.. ఇక ఆ హీరోయిన్ రెమ్యునరేషన్ అమాంతం రెట్టింపు అయిపోతుంది. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరూ అలా తమ రెమ్యునరేషన్ ను పెంచిన వారే. అయితే, ఎంత స్టార్ డమ్ ఉన్నా సమంత మాత్రం ఎప్పుడూ నిర్మాతలకు అందుబాటులోనే ఉంది. వాళ్లు ఇచ్చినంతే తీసుకుంటూ వచ్చింది. కానీ సమంత ఇప్పుడు అలా లేదు.

డబ్బు విషయంలో అసలు మొహమాట పడట్లేదు. ఇష్టం వచ్చినంత ఇస్తాను అంటే కుదరదు అంటుంది. నిజానికి గతంలో ఎన్నడూ తన పారితోషికం విషయంలో సమంత అలా పేచీ పెట్టిన సందర్భాలు లేవు. ఇప్పటి వరకూ ఆమె నిర్మాతల ఇష్టానికే నడుచుకుంది. కానీ సమంత జీవితంలో ఈ మధ్య చోటు చేసుకున్న మార్పులు కారణంగా ఆమెకు ప్రస్తుతం డబ్బు ప్రధానం అయిపోయింది.
డబ్బు విషయంలో సమంత ఇలా పూర్తిగా మారిపోవడానికి కారణం ఏమిటి ? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. కారణం.. ఒక్కటే కనిపిస్తుంది. తానూ గతంలో కొందరు నిర్మాతలకు చాలా ఫేవర్ చేసింది. అయితే, తన జీవితంలో వచ్చిన కష్టాల సమయంలో వాళ్ళు ఎవ్వరూ ఆమెకు తోడుగా లేరట. పైగా తన పై జోక్ లు వేసుకున్నారని ఆమెకు తెలిసింది.
అందుకే, ఇక తన పారితోషికం విషయంలో ఎవరి కోసం ఎలాంటి మార్పులు చేయకూడదు అని ఆమె నిర్ణయించుకుంది. ఏ సినిమాకు ఎంత తీసుకోవాలి? అనే దాని పై సమంత ఇప్పుడు పక్కా లెక్కలతో ఉందట. కాకపోతే, సామ్ మరీ ఇంత పట్టుదలకు పోతే.. ఆమెకు సినిమా అవకాశాలు కూడా రావు అని సినిమా ఇన్ సైడ్ వర్గాల అభిప్రాయం.
సమంత ఇటీవల రెండు కొత్త సినిమాల్ని ఒప్పుకుంది. ఓ సినిమా కోసం తను రూ.3 కోట్ల పారితోషికం కావాలని అడుగుతుంది. ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే, రష్మిక లాంటి వాళ్లే 2 కోట్ల మార్క్ దగ్గర ఆగిపోయారు. అలాంటిది ఎప్పుడో పెళ్లి అయి, పైగా భర్తతో విడిపోయిన హీరోయిన్ కి అంత డబ్బు ఎందుకు ఇవ్వాలి ? అంటూ నిర్మాతలు క్వశ్చన్ చేస్తున్నారు.
మొత్తానికి సమంత మాత్రం తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి, బాగా డబ్బు చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది.