అయ్యా వీహెచ్‌ గారూ.. మీడియా మీద చిందులేంటి..!

వీహెచ్‌.. వి.హనుమంతారావు. కాంగ్రెస్‌ పార్టీలో మోస్ట్‌ సీనియర్‌‌ లీడర్‌‌. అంత సీనియర్‌‌ లీడర్‌‌ అయి ఉండి ఎప్పుడు ఏం మాట్లాడుతారో పాపం ఆయనకే ఒక్కోసారి బోధపడదు. అప్పుడప్పుడు గాడి తప్పి మాట్లాడుతుంటారు. ఓపిక కోల్పోయి ఆవేశానికి లోనవుతుంటారు. చివరకు సొంత అధిష్టానాన్ని కూడా ఎదిరించేందుకు కూడా వెనుకాడడం లేదు. వీహెచ్‌ ప్రెస్‌మీట్ చూస్తే మరోసారి ఇవి రుజువయ్యాయి. ‌త‌ను చెప్పాల‌నుకున్నది చెప్పేశారు. కానీ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో సామాన్య జ‌నాలు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. Also Read: […]

Written By: Srinivas, Updated On : December 31, 2020 5:42 pm
Follow us on


వీహెచ్‌.. వి.హనుమంతారావు. కాంగ్రెస్‌ పార్టీలో మోస్ట్‌ సీనియర్‌‌ లీడర్‌‌. అంత సీనియర్‌‌ లీడర్‌‌ అయి ఉండి ఎప్పుడు ఏం మాట్లాడుతారో పాపం ఆయనకే ఒక్కోసారి బోధపడదు. అప్పుడప్పుడు గాడి తప్పి మాట్లాడుతుంటారు. ఓపిక కోల్పోయి ఆవేశానికి లోనవుతుంటారు. చివరకు సొంత అధిష్టానాన్ని కూడా ఎదిరించేందుకు కూడా వెనుకాడడం లేదు. వీహెచ్‌ ప్రెస్‌మీట్ చూస్తే మరోసారి ఇవి రుజువయ్యాయి. ‌త‌ను చెప్పాల‌నుకున్నది చెప్పేశారు. కానీ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో సామాన్య జ‌నాలు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.

Also Read: కేసీఆర్‌‌ యూటర్న్‌ వెనుక అసలు కారణం అదేనా..!

‘మిమ్మల్ని ఢిల్లీ అధిష్ఠానం ప‌క్కన పెట్టిందని.. మీ లేఖ‌ల‌కు రెస్పాండ్ కావ‌ట్లేద‌ని చెప్పుకొని మిమ్మల్ని మీరు త‌క్కువ చేసుకున్నట్లు అనిపించ‌ట్లేదా..? రేవంత్ ఢిల్లీలో మేనేజ్ చేస్తున్నాడంటూ అమాయ‌కంగా మీరు చెప్పడం రేవంత్ బ‌ల‌వంతుడ‌ని చెప్పిన‌ట్లు కాదా..? తెలంగాణ వ్యతిరేకి రేవంత్ అంటున్న మీకు తెలంగాణాను వ్యతిరేకించిన టీడీపీతో చెట్టాప‌ట్టాలేసుకొని తిరిగింది స‌మంజ‌సం అనిపించిందా..? రేవంత్‌కు పీసీసీ ఇస్తే మా దారి మేం చూసుకుంటామంటూ మీరు చేసిన వ్యాఖ్యలు బ్లాక్‌మెయిలింగ్‌లా అనిపించ‌ట్లేదా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే.. ద‌శాబ్దకాలంగా ఎన్నో ప‌ద‌వులు చూసిన వీహెచ్‌ నోటి వెంట ఇలాంటి మాట‌లు రావ‌డం సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేక‌పోతున్నారు. నిజంగా ఈ ప్రెస్‌మీట్‌లో మాట్లాడినదంతా కేవ‌లం పార్టీకి సంబంధించిన అంశం. ఈ ప్రెస్ మీట్ వ‌ల్ల న‌ష్టమంటూ జ‌రిగితే అది కాంగ్రెస్‌కే ఎక్కువ‌. రేవంత్ రెడ్డికి పీసీసీ ప‌ద‌వి ఇవ్వడం ఇవ్వక‌పోవ‌డం పార్టీ అంత‌ర్గత విష‌యం.. దానికి మీడియా పై చిందులు వేయడం బాగుందా..? అని నిలదీస్తున్నారు.

Also Read: ప్రపంచ మెడికల్ హబ్ గా ఇండియా మారబోతుందా?

మాస్‌ లీడర్‌‌ రేవంత్‌ అని రాసినంత మాత్రాన అధిష్టానం రేవంత్‌కు పట్టం కట్టబెడుతుందా..? రేవంత్ దే పీసీసీ అని మీడియా రాసినంత మాత్రాన అది నిజ‌మ‌ని మీరు ఉలిక్కిప‌డ‌ట‌మెందుకు..? ఏళ్ల త‌ర‌బ‌డి కాంగ్రెస్‌లో ఉన్న మీరే కాంగ్రెస్ రాజ‌కీయాల‌ను అస‌హ్యించుకుంటే.. సామాన్యులు ఛీ కొట్టండం త‌ప్పు కాదు కదా. అందుకే గ్రేట‌ర్‌లో, దుబ్బాక‌లో వ్యతిరేక ఫ‌లితాలు ఇచ్చారు. ఇక్కడ మ‌రో విష‌యం ఏంటంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే విష‌యాన్ని ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడంలో విఫ‌ల‌మైంది కాంగ్రెస్ సీనియ‌ర్లేన‌ని అధిష్ఠానం బ‌ల‌మైన న‌మ్మకం కదా. వీటన్నింటినీ తెలుసుకొని మాట్లాడితే మంచిదంటూ చురకలంటిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్