Mokshagna Teja: 30 ఏళ్ల వయసులో మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్నారు. చాలా కాలంగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణం ఇది. గత ఐదేళ్లుగా మోక్షజ్ఞ హీరో కావాలనే డిమాండ్ వినిపిస్తుంది. కారణం తెలియదు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ అయితే… 17 ఏళ్లకు హీరో అయ్యాడు. 19 ఏళ్లకే బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ హీరోల జాబితాలో చేరాడు. మోక్షజ్ఞ ని లాంచ్ చేసే బాధ్యత బాలకృష్ణ దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఇచ్చాడు. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ బాలకృష్ణ దృష్టిని ఆకర్షించాడు.
సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో విజువల్ వండర్ గా మోక్షజ్ఞ మూవీ తీర్చిదిద్దాలని చూస్తున్నారు. బడ్జెట్ సైతం భారీగా ఉండనుంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు ఇటీవల ముహూర్తం ఫిక్స్ చేశారు. సడన్ గా క్యాన్సిల్ చేశారు. మోక్షజ్ఞ మొదటి సినిమా పూజా కార్యక్రమం కోసం లక్షలు ఖర్చు చేసి సెట్ కూడా వేశారట. చివరి నిమిషంలో ఆగిపోయిందట.
మోక్షజ్ఞకు ఆరోగ్యం బాగోలేదు. ఈ కారణంగానే పూజా కార్యక్రమం ఆగిందని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. కాగా ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ మూవీ ఆగిపోయిందంటూ ఓ పుకారు సైతం తెరపైకి వచ్చింది. బాలయ్యతో ప్రశాంత్ వర్మకు చెడింది. ప్రాజెక్ట్ చేయడం లేదని కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చిత్రీకరణ కూడా ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత లేదు. మోక్షజ్ఞ తో కూడిన ఒక పోస్టర్ మాత్రం రిలీజ్ చేశారు.
అయితే కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ మోక్షజ్ఞతో మూవీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఆయన మోక్షజ్ఞ హీరోగా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నాగ్ అశ్విన్ అపజయం లేని దర్శకుడు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలతో సత్తా చాటిన నాగ్ అశ్విన్.. కల్కి తో ఏకంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టాడు. కల్కి 2 స్క్రిప్ట్ పనుల్లో ఉన్న నాగ్ అశ్విన్ కి మోక్షజ్ఞతో మూవీ చేయాలనే ఆశ ఉందట. అయితే దానికి చాలా సమయం ఉంది. కల్కి 2 అనంతరం మోక్షజ్ఞతో మూవీ చేస్తాడన్న వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు. భవిష్యత్ లో మాత్రం ఈ కాంబో సాకారం అవుతుందని అంచనా వేస్తున్నారు.
Web Title: Mokshagna teja movie with kalki director nag ashwin
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com