Mokshagna: నందమూరి బాలకృష్ణ సినీ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై ఒక ఎక్స్ క్లూజివ్ అప్ డేట్. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా రానుంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయింది. కాకపోతే, ఈ సినిమా మరో ఏడాది తర్వాతే మొదలవుతుంది. అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో రెండు నేపథ్యాలు ఉండబోతున్నాయి. చారిత్రకం తో పాటు ఐరోపా నేపథ్యాన్ని కూడా సినిమాలో చూపిస్తారట. ముఖ్యంగా మోక్షజ్ఞ పాత్ర చాలా వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే, మొదటి సినిమాలోనే విభిన్న పాత్రలో కనిపిస్తే.. అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే అభిమానులకు నచ్చుతాయి.
మెయిన్ గా బాలయ్య అభిమానులు పక్కా మాస్ ఆడియన్స్. వారికీ నచ్చే విధంగా సినిమా చేయాలి గానీ, కొత్తదనం కోసం ఉన్న ఇమేజ్ ను కూడా పాడు చేసుకుంటే.. స్టార్ డమ్ రావడం కష్టమే అవుతుంది. మరోపక్క మాత్రం మోక్షజ్ఞ బాగా కష్టపడుతున్నాడు. హీరో అయ్యే దిశగా మోక్షజ్ఞ భారీ కసరత్తు చేస్తున్నాడు.
అయితే, ‘ఆదిత్య 369’ సీక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ అని ఆ మధ్య బాగా టాక్ నడిచింది. పైగా మోక్షజ్ఞ తెరంగేట్రం చేయడానికి ‘ఆదిత్య 369’ సీక్వెల్ పర్ఫెక్ట్ అంటూ నందమూరి అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఉన్నట్టు ఉండి.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ ప్లేస్ లో క్రిష్ సినిమా వచ్చింది. నిజానికి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్య 999’ను తెరకెక్కించాలని రెండు ఏళ్ళు వర్క్ చేశారు.
Also Read: Actress pranitha: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రణీత…
పైగా సింగీతం స్క్రిప్ట్ కూడా బాలయ్యకు నచ్చింది. అయితే, ప్రస్తుతం ఆరోగ్య కారణాల దృష్ట్యా సింగీతం డైరెక్ట్ చేసే పరిస్థితిలో లేరని, అందుకే.. బాలయ్య క్రిష్ ను లైన్ లోకి తీసుకు వచ్చారని తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా మోక్షజ్ఞ తన ఫిజిక్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టి.. ఈ సారి మోక్షజ్ఞ కొత్తగా కనిపిస్తాడట. కొత్తగా అంటే.. మరి మోక్షజ్ఞ తన లుక్ ను ఎలా మార్చుకుంటాడో చూడాలి.
Also Read: Anchor Suma: త్వరలో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్న బుల్లితెర స్టార్ యాంకర్ సుమ…