Mokshagna: నందమూరి హీరో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ మిలియన్ డాలర్ క్వచ్చన్ గా ఉంది. సాధారణంగా స్టార్ కిడ్స్ 20-25 ఏళ్ల లోపు వెండితెరకు పరిచయం అవుతారు. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ బాల నటులుగా అరంగేట్రం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ టీనేజ్ దాటే నాటికే మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. మోక్షజ్ఞకు బాగా ఆలస్యం అయ్యింది. ఆయన మూడు పదుల వయసుకు దగ్గరపడ్డాడు. అందుకు కారణాలు ఏమిటనేది తెలియదు. మోక్షజ్ఞకు హీరో కావడం ఇష్టం లేదనే ప్రచారం జరిగింది.
ఫ్యాన్స్ పట్టుబట్టడంతో మోక్షజ్ఞ మనసు మార్చేందుకు బాలకృష్ణ యజ్ఞయాగాదులు, పూజలు చేయించాడని సమాచారం. ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ పై ప్రకటన ఉంటుంది. బాలయ్య పలుమార్లు త్వరలోనే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తున్నామంటూ ప్రకటనలు చేశారు. అవేమీ కార్యరూపం దాల్చలేదు. 2024లో మాత్రం మోక్షజ్ఞ ముఖానికి మేకప్ వేసుకోవడం ఖాయం అంటున్నారు.
కథతో పాటు దర్శకుడిని కూడా బాలకృష్ణ ఫైనల్ చేశాడట. పూరి జగన్నాధ్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను… ఇలా అనేక పేర్లు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్స్ లిస్ట్ లో వినిపించాయి. అయితే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఆ ఛాన్స్ దక్కినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రశాంత్ వర్మ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ లో ఒకరు. ఆయన సబ్జెక్ట్స్ వినూత్నంగా ఉంటాయి.
ఈ సంక్రాంతికి హనుమాన్ మూవీతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. తేజా సజ్జా హీరోగా నటించిన సూపర్ హీరో ఫాంటసీ చిత్రం హనుమాన్ రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకు బాలకృష్ణ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ ప్రాజెక్ట్ 2024లోనే పట్టాలెక్కనుందట. తాజా న్యూస్ బాలయ్య ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది. చొక్కాలు చించుకునేందుకు సిద్ధం అంటున్నారు. మోక్షజ్ఞ మేకోవర్ కూడా సాధించాడట.