Chiranjeevi Surekha Marriage: కలెక్టర్ ని చేసుకోవాల్సిన సురేఖ చిరంజీవిని పెళ్లాడింది… అంతా ఆ రెడ్డిగారి వల్లే!

Chiranjeevi Surekha Marriage: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అంటే ఎవరికి ఎవరో ఆ దేవుడు ముందే రాసుంటాడు. అలా చిరంజీవి భార్య కావాలని సురేఖ నుదిటిన రాసి ఉంది, జరిగింది. వీరి వివాహం వెనుక ఓ పెద్ద మనిషి సలహా ఉందని, తాజాగా బయటికొచ్చింది. హీరో కావాలని చెన్నై వెళ్లిన చిరంజీవికి వచ్చిన మొదటి అవకాశం పునాదిరాళ్లు. అయితే విడుదలైన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు(1978). నటుడిగా నిలదొక్కుకోవడం కోసం చిరంజీవి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా […]

Written By: Shiva, Updated On : June 13, 2022 1:36 pm
Follow us on

Chiranjeevi Surekha Marriage: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అంటే ఎవరికి ఎవరో ఆ దేవుడు ముందే రాసుంటాడు. అలా చిరంజీవి భార్య కావాలని సురేఖ నుదిటిన రాసి ఉంది, జరిగింది. వీరి వివాహం వెనుక ఓ పెద్ద మనిషి సలహా ఉందని, తాజాగా బయటికొచ్చింది. హీరో కావాలని చెన్నై వెళ్లిన చిరంజీవికి వచ్చిన మొదటి అవకాశం పునాదిరాళ్లు. అయితే విడుదలైన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు(1978). నటుడిగా నిలదొక్కుకోవడం కోసం చిరంజీవి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తున్న రోజులవి. విలన్, సైడ్ విలన్, సైడ్ హీరో పాత్రలు చేస్తున్నారు.

Chiranjeevi, Surekha

అయితే చిరంజీవిలో ప్రత్యేకత ఉంది, పెద్ద స్టార్ కాగలడనే నమ్మకం అల్లు రామలింగయ్యకు కలిగింది. నిజానికి అప్పటికే అల్లు రామలింగయ్య పెద్ద స్టార్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. నిర్మాతగా కూడా మారారు. కోట్ల ఆస్తిపరుడు. అయినా చిరంజీవిని అల్లుడిగా చేసుకోవాలనుకున్నారు. చిరంజీవికి ఈ విషయం చెప్పగానే వెంటనే ఓకే చెప్పాడట. అయితే అల్లు రామలింగయ్యకు ఎక్కడో సందిగ్ధత ఉంది. అదే సమయంలో సురేఖకు కలెక్టర్ సంబంధం వచ్చిందట. వేల మందిలో ఒక్కడు కూడా సక్సెస్ కాలేనంత పోటీ సినిమా రంగంలో ఉంటుంది. కాబట్టి చిరంజీవికి పిల్లను ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారట.

Also Read: Mohanlal: మోహన్ లాల్ కి మూడేళ్ల జైలు శిక్ష.. కారణం ఏంటో తెలుసా?

అప్పుడు పరిశ్రమలో తనకు సన్నిహితుడు అయిన నటుడు ప్రభాకర్ రెడ్డిని అల్లు రామలింగయ్య సంప్రదించారట. ఏమండీ రెడ్డి గారూ… సురేఖను చిరంజీవి చేసుకుంటాను అంటున్నాడు. అలాగే ఓ కలెక్టర్ సంబంధం కూడా వచ్చింది. ఇద్దరిలో ఎవరికి ఇస్తే బాగుంటుందని అడిగారట. అప్పుడు ప్రభాకర్ రెడ్డి… ఈ విషయంలో నిర్ణయం అమ్మాయికి వదిలేస్తే మంచిది. అమ్మాయి ఇష్టం లేకుండా మనం ఎంత గొప్ప వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినా సుఖంగా ఉండదు. సురేఖ నిర్ణయం తెలుసుకోమని ప్రభాకర్ రెడ్డి చెప్పారట.

Chiranjeevi, Surekha

మరి ఏ ప్రాతిపదిక సురేఖ నిర్ణయం తీసుకున్నారో కానీ.. కలెక్టర్ వద్దు, నాకు చిరంజీవి కావాలి అన్నారట. దీంతో 1980, ఫిబ్ర‌వ‌రి 20న మ‌ద్రాసులో చిరంజీవి-సురేఖల పెళ్లి జ‌రిగింది. ఉద‌యం 10.04 నిమిషాల‌కు చిరంజీవి, సురేఖ వివాహం ఘ‌నంగా జ‌రిగింది. సురేఖ వ‌చ్చిన త‌ర్వాతే త‌న జీవితంలో ఎన్నో మార్పులు వ‌చ్చాయ‌ని.. ఆమె వ‌చ్చిన త‌ర్వాతే త‌న కెరీర్ కూడా మారిపోయింద‌ని చాలా సార్లు చెప్పాడు మెగాస్టార్. అలా కలెక్టర్ భార్యగా గుర్తింపు లేకుండా కనుమరుగు కావాల్సిన సురేఖ చిరంజీవి భార్యగా స్టేటస్, హోదా దక్కించుకున్నారు. అల్లు ఫ్యామిలీతో చుట్టరికం ఇరు వర్గాలకు మేలు చేసింది. చిరంజీవి -సురేఖల పెళ్ళికి ముందు జరిగిన ఈ తతంగాన్ని ప్రభాకర్ రెడ్డి భార్య ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Also Read:Nani Hikes Remuneration: నాని షాకింగ్ రెమ్యునరేషన్… ఇప్పుడిదే హాట్ టాపిక్, అంత పెంచేశాడు!

Tags