https://oktelugu.com/

Mohan Babu : మీడియా మీద అసహనాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన మోహన్ బాబు…ఇంతకీ అందులో ఏం ఉంది..?

మొత్తానికి అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రోజుకొక కాంట్రవర్సీ తెర మీదకి వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : December 14, 2024 / 04:01 PM IST

    mohan babu

    Follow us on

    Mohan Babu : మొత్తానికి అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రోజుకొక కాంట్రవర్సీ తెర మీదకి వస్తున్నాయి. రీసెంట్ గా మోహన్ బాబు అతని కొడుకులకు మధ్య జరిగిన వివాదాలు, మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం అలాగే తన కొడుకు అయిన మంచు మనోజ్ మీద కూడా దాడి చేయడం చేశారు. దాంతో ఆయన మీద పలు పోలీస్ స్టేషన్ల లో కొన్ని కేసులైతే నమోదయ్యాయి…

    కలెక్షన్ కింగ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబు గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన వివాదాలను ఎదుర్కొంటున్నాడు. ఇక తన కొడుకు అయిన మంచు మనోజ్ తో గత కొన్ని రోజుల నుంచి విభేదాలైతే పెట్టుకుంటున్నాడు. ఇక ఒక నాలుగు రోజుల క్రితం మంచు మనోజ్ తన ఫాదర్ అయిన మోహన్ బాబు ఆయన అనుచరులతో తన మీద దాడి చేయించాడు అంటూ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అయితే పెట్టాడు. ఇక దాంతో మోహన్ బాబు మీద కేసు అయితే నమోదయింది. ఇక దానికి తగ్గట్టుగానే మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడంతో రంజిత్ అనే రిపోర్టర్ కి భారీగా గాయాలయ్యాయి. మోహన్ బాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదయ్యింది. ఇక దీంతో మోహన్ బాబు మీడియా కి సారీ చెప్పడం అన్నీ జరిగిపోయాయి. ఇక ఈ నేపథ్యంలో ఆయనను కేసు విషయంలో అరెస్టు చేస్తారని తెలుసుకున్న మోహన్ బాబు ముందస్తు బెయిల్ ను అప్లై చేశాడు. ఇక దాంతో ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిందంటూ తద్వారా మోహన్ బాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తుంటే ఆయన పరారీలో ఉన్నట్టుగా మీడియాలో కొన్ని కథనాలైతే వెలువడ్డాయి. ఇక దాని మీద స్పందించిన మోహన్ బాబు రీసెంట్ గా ఒక ట్వీట్ అయితే చేశాడు.

    అందులో ఏముందంటే మీడియా వాళ్ళు నా బెయిల్ రద్దయిందని నేను పరారీలో ఉన్నానని కొన్ని వార్తలైతే రాస్తున్నారు. నిజానికి నేను నా ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ముందస్తు బెయిల్ అయితే రద్దు అవ్వలేదు. ఇక దానికి తగ్గట్టుగా నేను ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం కూడా నాకు లేదు.

    దయచేసి మీడియా ఉన్నది ఉన్నట్టుగా రాయండి లేనిపోని తప్పుడు వార్తలను సృష్టించి రాయకండి అంటూ తను ట్వీట్ చేశాడు. ఇక మొత్తానికైతే మోహన్ బాబు మీడియా మీద కొంత వరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోహన్ బాబు బెయిల్ కనక రిజెక్ట్ అయినట్టైతే అరెస్టు అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

    Mohan Babu Tweet

    ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు ఇంట్లో తన కొడుకులతో విభేదాలను పెట్టుకొని చాలా వరకు ఆయన ఇమేజ్ ను డామేజ్ అయితే చేసుకున్నాడు. మరి ఈ సందర్భంలో వీళ్ళ మధ్య వచ్చిన గొడవలు తగ్గుముఖం పట్టాయా లేదంటే ఆ గొడవలతో మరోసారి మీడియా ముందుకు రాబోతున్నారా? అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.