కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మంచు మోహన్ బాబు పవన్ కామెంట్స్ పై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కల్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్ కల్యాణ్‌గారు అనడంతో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే.

ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదిన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను’అని మోహన్ బాబు ట్వీట్ చేశాడు.
మరి పవన్ కళ్యాణ్.. మోహన్ బాబు ట్వీట్ పై ఎలా స్పందిస్తారో చూడాలి. మరోపక్క ఏపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై వైసీపీ నేతలు పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కల్యాణ్ కి కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా మాకు ఒక్కటే అంటూ షాకింగ్ కామెంట్స్ చేయగా..
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021
మరో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా ‘నోరుందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడాడు’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పై విమర్శలు చేశారు. ఇంకా పవన్ పై విమర్శలు చేయడానికి వైసీపీ నేతలు సన్నద్ధం అవుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. పవన్ సినిమాలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని సినీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.