Homeఎంటర్టైన్మెంట్Mohan Babu Manchu Vishnu Issues In HRC: మోహన్ బాబు, మంచు విష్ణుల...

Mohan Babu Manchu Vishnu Issues In HRC: మోహన్ బాబు, మంచు విష్ణుల పై హెచ్‌ ఆర్సీలో ఫిర్యాదు !

Mohan Babu Manchu Vishnu Issues In HRC:మోహన్ బాబు దగ్గర పది సంవత్సరాల నుండి మేకప్ మెన్‌ గా పనిచేస్తున్నాడు శ్రీనివాస్‌. ఇతను నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన వాడు. అయితే శ్రీనివాస్ పై మోహన్ బాబు వృద్ధ సింహంలా గర్జించి బూతులు తిట్టిన సంగతి తెలిసిందే. పైగా ఎందుకు గొడవ అని అడిగినందుకు శ్రీనివాస్ పై మోహన్ బాబు బూతులతో విరుచుకు పడ్డారు. అయితే, తమ కులాన్ని కించపరిచారంటూ మోహన్‌ బాబు, మంచు విష్ణు పై నాయీ బ్రహ్మణ సంఘం నేతలు తెలంగాణ హెచ్‌ ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

Mohan Babu Manchu Vishnu Issues In HRC
Mohan Babu, Manchu Vishnu

కాగా వారి పై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. మంచు విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీను‌పై దొంగతనం కేసు బనాయించడమే కాకుండా కులం పేరుతో దూషించి తమ మనోభావాలను కించపరిచారని ఆరోపించారు. ఇంకా కులాల పేరుతో దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ మోహన్ బాబు దగ్గర ఉద్యోగం మానేశాడు.

Also Read: KCR National Politics: కేసీఆర్‌పై ఆప్ నేత సంచలన కామెంట్స్.. సడెన్ గా ఏంటీ పరిణామం

కాగా అతను జాబ్ మానేశాడు అని కక్షగట్టి ఎలాంటి నేర నిరూపణ చేయకుండా శ్రీనివాస్ మీద పోలీస్ స్టేషన్లో రూ.5 లక్షల సామగ్రి దొంగిలించాడని కేసు పెట్టారు మోహన్ బాబు టీమ్. ఇక చేసేది ఏమి లేక, శ్రీనివాస్ బయటకు వచ్చి.. జరిగింది మొత్తం వివరించాడు. తమ కులాన్ని తిట్టిన సంగతి కూడా అతను చెప్పాడు. ఇది నాయీ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నదని ఆ కుల నాయకులు చాలా సీరియస్ గా ఉన్నారు.

Mohan Babu Manchu Vishnu Issues In HRC
Mohan Babu,Vishnu, Naga Srinu

పైగా మోహన్ బాబు మంగలి సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆ కులానికి చెందిన నాయకులు హెచ్చరించారు. మరి నాయీ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసిన మోహన్ బాబు నాయీ బ్రాహ్మణ సమాజానికి బేషరత్తుగా క్షమాపణ చెబుతాడా లేదా అనేది చూడాలి.

Also Read: Vijay Devarakonda Movie With Samantha: విజయ్ దేవరకొండతో సమంతను కలుపుతున్న మైత్రి

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version