Congo Man Marries Triplets: వారు ముగ్గురు కవల పిల్లలు. జీవితంలో అన్ని సమానంగా పంచుకునే వారు. డ్రెస్సులు కానీ ఏదైనా విషయంలో ముగ్గురి అభిప్రాయాలు ఒకేలా ఉండేవి. దీంతో వారి తల్లిదండ్రులు సైతం మురిసిపోయేవారు. తమ పిల్లల చేష్టలతో మురిసిపోయేవారు. వారి అన్యోన్యాన్ని చూసి అబ్బురపడేవారు. జీవితంలో ఇంకా మంచిగా ఉండాలని కలలు కనేవారు. వారు ముగ్గురు కూడా ఒకే వ్యక్తిని ఇష్టపడతారని మాత్రం అనుకోలేదు. జీవితంలో తల్లిదండ్రులకు కూడా ట్విస్ట్ ఇచ్చారు. తాము ప్రేమించింది అక్క ప్రియుడే కావడంతో ఇదేంటని ముక్కున వేలేసుకున్నారు.
సాధారణంగా కవల పిల్లలంటే అందరికీ మక్కువే. కాంగో దేశంలోని ఓ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు కవల పిల్లలు జన్మించారు. ముగ్గురూ ఆడపిల్లలే కావడం గమనార్హం. దీంతో వారు జీవితంలో అన్ని సమానంగా పంచుకునేవారు. ఏ విషయంలోనైనా ముగ్గురిది ఒకే అభిరుచి కావడంతో అందరు ముచ్చటపడేవారు. కానీ ముగ్గురు కూడా ఒక్కడినే ప్రేమిస్తారని మాత్రం అనుకోలేదు. దీంతో వారి టేస్ట్ కు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఒకే వ్యక్తి ముగ్గురికి భర్త కావడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.
Also Read: Pawan Kalyan Bheemla Nayak Movie: పవన్ కళ్యాణ్ ముందు చూపు.. ‘భీమ్లానాయక్’ లాభాలతో ఏం చేశాడో తెలుసా?
ఇందులో పెద్దమ్మాయి ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలని భావించింది. చెల్లెళ్లకు కూడా పరిచయం చేసింది. వారు కూడా అతడితో మాట్లాడేవారు. మరదళ్లు కావడంతో హాస్యంగా ఉండేవారు. ఈ క్రమంలో మిగతా ఇద్దరు కూడా అతడి ప్రేమలో పడిపోయారు. తమ అభిప్రాయాన్ని అక్కతో చెప్పారు. మొదట కంగారు పడినా తరువాత ఒప్పుకోక తప్పలేదు. ఈ దేశంలో బహు భార్యాత్వం చట్టబద్ధం కావడంతో వారి వివాహానికి అడ్డు లేకుండా పోయింది. ఆ ముగ్గురు ముద్దుగుమ్మలను పెళ్లి చేసుకున్న యువకుడిగా అతడు అందరిని అబ్బురపరుస్తున్నాడు.
తల్లిదండ్రులు మాత్రం వీరి వివాహానికి పచ్చజెండా ఊపలేదు. ముగ్గురిని పెళ్లాడితే తమ కూతుళ్లు సంతోషంగా ఉండరని భావించారు. వారు తమ ప్రేమను త్యాగం చేయడానికి ఇష్టపడలేదు. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకున్నారు. పెద్దలను ఎదిరించారు. వారి సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. అదే మన దేశంలో అయితే ముగ్గురిని కట్టుకున్నపాపానికి కటకటాలు లెక్కించాల్సి వచ్చేది. అక్కడ ఉన్న చట్టాల ప్రభావంతోనే ఆ నలుగురు ఒక్కటైనట్లు తెలుస్తోంది. ఏ దేశంలో అయినా అక్కడి చట్టాలకు అనుకూలంగా మసలుకోవడమే పౌరుల కర్తవ్యం.