Minister Kodali Nani: వైసీపీ ప్రభుత్వంలో చాలా రోజులుగా ఓ వార్త మంటలు రేపుతూనే ఉంది. మంత్రుల మార్పు ఉంటుందని, ఇప్పుడు ఉన్న వారినందరిని మార్చేస్తానని అదుగో ఇప్పుడు అప్పుడు అంటూ పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. రాధా ఇప్పుడు చాలా కాలంగా ఉగాది తర్వాత కచ్చితంగా మంత్రుల మార్పు ఉంటుందనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వైసీపీలోనే చాలా ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన కొడాలి నాని పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని అంటున్నారు విశ్లేషకులు.
కొడాలి నాని సీఎంకు అత్యంత సన్నిహితుడు. నానితో ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో ఓ సారి అసెంబ్లీ సాక్షిగా జగన్ వెల్లడించారు. అయినా సరే పూర్తిగా మార్పు చేయాల్సిందే అని జగన్ డిసైడ్ అయ్యారు అంట. అందులో భాగంగా కొడాలి నాని ప్లేస్లో ఎవరిని తీసుకోవాలనే చర్చలు మొదలయ్యాయనీ తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి ఆ స్థానాన్ని అప్పగించాలని జగన్ చూస్తున్నారన్నారట.
Also Read: పోలవరంపై కేంద్రం హామీలు సరే.. నిలబెట్టుకుంటదా.. నమ్మొచ్చా..?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి కొడాలి నాని ప్లేస్ను అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వంశీ కూడా టీడీపీ మీద ఒంటికాలిపై లేస్తున్నారు. పైగా సామాజిక వర్గం ఒకటే కావడంతో.. ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి కేబినెట్లోకి తీసుకోవాలని జగన్ టీం ప్లాన్ చేసింది. కాకపోతే అతనితో పాటు మరింతమంది అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు.
ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ రఘురాం పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వీరంతా జగన్ కు మొదటి నుంచి అండగా ఉంటున్న వారే. పైగా కృష్ణా జిల్లాకు చెందిన వారే కావడంతో మీరు కూడా ప్రధానంగా రేసులో ఉన్నారు. ప్రకాశం, గుంటూరు నుంచి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. కృష్ణా జిల్లాకు చెందిన వారికే నాని శాఖలను అప్పగించాలని తద్వారా ఆ జిల్లాల్లో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది.
ఉగాది తర్వాత ఎలాగూ కొత్త జిల్లాలలో పరిపాలన మొదలవుతుంది. పైగా జగన్ పాలనకు 3 ఏళ్ళు కూడా పూర్తి అవుతాయి కాబట్టి ఇదే ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. కాగా నానికి పార్టీలో కీలక స్థానాన్ని అప్పగిస్తారని, ఫైర్ బ్రాండ్ ను పార్టీలో కొనసాగిస్తారని సమాచారం. అయితే నాని తప్పించడానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. కేశినో వివాదం, ప్రతిపక్షాల పై అనుచిత వ్యాఖ్యలు లాంటివి అటు ప్రజల నుంచి కూడా కొన్నిసార్లు విమర్శలకు దారి తీస్తున్నాయి. గౌరవప్రదమైనటువంటి మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. ఇలా ప్రవర్తించడంపై జగన్ కూడా కొంత అసహనంగా ఉన్నారంట. మరి కొడాలి నాని మంత్రి పదవి తీసేస్తే ఎలా స్పందిస్తారు ఎలాంటి చర్యలకు సిద్ధం అవుతారు అనేది మాత్రం వేచిచూడాల్సిందే.
Also Read: కేసీఆర్‌పై ఆప్ నేత సంచలన కామెంట్స్.. సడెన్ గా ఏంటీ పరిణామం