Mohan Babu Look In The Paradise: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన దసర సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో నాని మరోసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. ‘జడల్’ అనే పాత్రను పోషిస్తున్న నాని తన జడల మీద ఎవరైనా చేయి వేసినా లేదంటే కామెంట్స్ చేసిన కూడా వాళ్ల తిప్పురేగ్గోడతాడట. ఈ విషయం కూడా డైరెక్టర్ గతంలో క్లారిటీ ఇచ్చాడు. ఇక నాని హీరోగా చేస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కానీ ఎట్టకేలకు విలన్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్ నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక గత కొద్దిసేపటి క్రితమే ప్యారడైజ్ సినిమా నుంచి మోహన్ బాబు లుక్ ను కూడా రిలీజ్ చేశారు. షర్టు లేకుండా కత్తి మీద చెయ్యి వేసి ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ తో చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ద్వారా మోహన్ బాబు రేంజ్ మారబోతుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం… అయితే ఇందులో మోహన్ బాబు విలన్ పాత్రను పోషిస్తున్నాడు ఆయన ఇప్పటివరకు ఎప్పుడు చేయనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించడమే కాకుండా సరికొత్త విలనిజాన్ని పండించాడట…ఇప్పుడు కూడా అలాంటి మ్యానరిజమ్స్ తోనే ఈ సినిమాలో కనిపించబోతున్నారట.
మొత్తానికైతే మోహన్ బాబు ఇస్ బ్యాక్ అనే రేంజ్ లో క్యారెక్టర్ ఉంటుందని ఆయన పాత్ర సరికొత్త విలనిజాన్ని సెట్ చేసే విధంగా ఉంటుందట. ఇప్పటివరకు విలనంటే ఒక రేంజ్ లో చూపించారని, కానీ మోహన్ బాబు ఈ సినిమాలో పోషిస్తున్న పాత్ర ఇకమీదట తెలుగు ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని చెబుతున్నారు…
ఇక దానికి తగ్గట్టుగానే ఈ పోస్టర్ చూస్తే శ్రీకాంత్ ఓదెల చెప్పింది అక్షరసత్యంగా కనిపిస్తోంది. మోహన్ బాబు విలక్షణమైన నటుడు అనే విషయం మనందరికి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఆయన పొటెన్షియాలిటీని బయటపెట్టే క్యారెక్టర్ అయితే పడడం లేదు. అందుకే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చాలా కామ్ గా ఉంటున్నాడు. పెద్దగా సినిమాలను కూడా చేయడం లేదు.
మొత్తానికైతే ‘ప్యారడైజ్’ సినిమాలో శ్రీకాంత్ ఓదెల చెప్పిన క్యారెక్టర్ తనకు నచ్చడమే కాకుండా శ్రీకాంత్ కాన్ఫిడెన్స్ చూసి మోహన్ బాబు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట… ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం 2026 మార్చి 26వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…