Manchu Mohan Babu : గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు కుటుంబం లో చోటు చేసుకున్న వివాదాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు విష్ణు ఆస్తుల విషయం లో తన తండ్రి మోహన్ బాబు, అన్నయ్య మంచి విష్ణు లతో చాలా కాలం నుండే గొడవ పడుతూనే ఉన్నాడు. మంచు విష్ణు దుబాయ్ లో ఉన్న సమయంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం, ఆ తర్వాత మనోజ్ మోహన్ బాబు పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, నేను సీనియర్ సిటిజెన్ ని, నాకు నా కొడుకు నుండి రక్షణ కల్పించండి, వాడిని నా ఇంటి నుండి గెంటేయండి అంటూ పోలీసులను మోహన్ బాబు ఆశ్రయించడం, ఇలా ఒక దాని తర్వాత ఒకటి వారం రోజులపాటు ఈ వివాదం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఒక ఈ వివాదాలను కవర్ చేయడానికి వచ్చిన మీడియా రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేయడం సంచలనంగా మారింది.
దాడికి గురైన ఆ మీడియా రిపోర్టర్ ఇప్పటికీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే ఉన్నాడు. మోహన్ బాబు పై ఈ విషయం లో కేసు నమోదు అయ్యింది. తన అరెస్ట్ ని ఆపాలంటూ ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ని కూడా కోర్టు రద్దు చేసింది. ఏ క్షణం లో అయినా ఆయన అరెస్ట్ అవ్వొచ్చు అని అనుకుంటున్న ఈ సమయంలో నేడు ఆయన మీడియా ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ఒకటైన ‘రాయలసీమ రామన్న చౌదరి’ చిత్రంలోని ఒక డైలాగ్ ని మార్చి చెప్తూ ‘ గతం గతః..నిన్న జరిగింది మర్చిపోవాలి..నేడు ఏమి చేయబోతున్నాము అనే దాని గురించి ఆలోచించాలి. ఈరోజు చేసిన దానికంటే రేపు ఇంకా ఎంత మంచి పనులు చేయాలి అనేది ఆలోచించాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
గతం గతః అన్నాడంటే గత నెలలో మంచు మనోజ్ తో జరిగిన వివాదాలను మొత్తం మర్చిపోవడానికి మోహన్ బాబు సిద్ధంగా ఉన్నాడా అని అనుకుంటున్నారు నెటిజెన్స్. మనోజ్ చేసిన రచ్చ మొత్తాన్ని వీడియో లతో సహా నెటిజెన్స్ గమనించారు. ఒక సందర్భంలో మనోజ్ మోహన్ బాబు స్టాఫ్ ని తాగేసి తూలుతూ వెళ్లి కొట్టబోతుండగా, మోహన్ బాబు అతన్ని వెనుక నుండి గట్టిగా పట్టుకొని ఆప్ ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వీడియో వచ్చింది. దీనిని బట్టి మనోజ్ మద్యానికి బానిస అయ్యాడు అని మోహన్ బాబు చెప్పిన మాటల్లో ఎలాంటి అబద్దం లేదని అర్థం చేసుకోవచ్చు. కొడుకు చెడిపోతుంటే ఒక తండ్రి పడే ఆవేదన ఆయన మాటల్లో ఉంది. చూస్తుంటే మనోజ్ వైపే ఎక్కువ తప్పు ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను ఇంట్లో సమస్యని బయటకి తీసుకొచ్చి పెద్ద రచ్చ చేయడం వల్లే మోహన్ బాబు ఆ కోపంతో మీడియా పై దాడి చేసి నేడు అరెస్ట్ అయ్యేందుకు డేంజర్ జోన్ లో పడేలా చేసిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు.