https://oktelugu.com/

Director Shankar : గేమ్ చేంజర్’ కి అమ్ముడుపోతున్న ప్రతీ టికెట్ రామ్ చరణ్ క్రేజ్ వల్లనేనా..? డైరెక్టర్ శంకర్ ఇమేజ్ ఈ రేంజ్ లో పడిపోయిందా!

ప్రతీ డైరెక్టర్ కి ఫ్లాప్స్ సర్వ సాధారణమే కదా, ఎందుకు శంకర్ విషయం లో స్పెషల్ గా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇండియన్ 2 ని చూసిన ఏ శంకర్ అభిమాని కూడా ఇది మా డైరెక్టర్ స్టైల్ కాదే అనే అభిప్రాయం ఏర్పడింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 8, 2025 / 07:15 PM IST

    Director Shankar

    Follow us on

    Director Shankar :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రకటించిన కొత్తల్లో క్రేజ్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. ఎందుకంటే రామ్ చరణ్ లాంటి స్టార్ శంకర్ లాంటి తోపు డైరెక్టర్ తో పని చేస్తున్నాడు, ఇక బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొంటాయి అంటూ ఎన్నో కలలు కన్నారు. కానీ ‘ఇండియన్ 2’ అలా కలలు కన్న అభిమానులకు ఇచ్చిన స్ట్రోక్ మామూలుది కాదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ప్రతీ డైరెక్టర్ కి ఫ్లాప్స్ సర్వ సాధారణమే కదా, ఎందుకు శంకర్ విషయం లో స్పెషల్ గా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇండియన్ 2 ని చూసిన ఏ శంకర్ అభిమాని కూడా ఇది మా డైరెక్టర్ స్టైల్ కాదే అనే అభిప్రాయం ఏర్పడింది.

    ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఆయన సరిగా తీయలేకపోయాడు. దీనికంటే బాలకృష్ణ ‘ఒక్క మగాడు’ చిత్రం చాలా వరకు బెటర్ కదా అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసారు ప్రేక్షకులు. అలాంటి ఘోరమైన ఫ్లాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడం తో ‘గేమ్ చేంజర్’ పై ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియా లో నెగటివిటీ మామూలు రేంజ్ లో లేదు. ఇంత నెగటివిటీ ఉన్నప్పటికీ కూడా, దానిని ఛేదించి అనేక చోట్ల రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయంటే అది కేవలం రామ్ చరణ్ క్రేజ్ వల్ల మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా వరకు తెగుతున్న ప్రతీ టిక్కెట్ రామ్ చరణ్ పేరు మీదనే అనొచ్చు. శంకర్ కి ఏర్పడిన నెగటివ్ ఇమేజ్ కారణంగా నార్త్ అమెరికా లో ‘గేమ్ చేంజర్’ అడ్వాన్స్ బుకింగ్స్ పై కాస్త ప్రభావం చూపింది.

    ఈ కాంబినేషన్ కి ఆల్ టైం రికార్డు రావాలి, కానీ కేవలం 1.5 మిలియన్ డాలర్లు మాత్రమే ప్రీమియర్ షోస్ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇదంతా కేవలం రామ్ చరణ్ కారణంగానే వచ్చాయి. అనేక మంది సాధారణ ప్రేక్షకులు ‘ఆమ్మో..శంకర్ సినిమానా.. ఆయన గత రెండు చిత్రాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూసాం..సినిమాకి టాక్ వస్తే వెల్దాములే’ అనే ధోరణితో ఉన్నారు. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమాకి ఇప్పుడున్న క్రేజ్ కి ప్రధాన కారణం చరణ్ వల్ల మాత్రమే, మేమంతా ఫామ్ లో లేము, సినిమా పరంగా జనాల్లో ఆసక్తిని తీసుకొని రాలేకపోయాము అంటూ ప్రెస్ మీట్ లో చెప్పడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ చిత్రం తో రామ్ చరణ్ 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొడితే తదుపరి చిత్రాలతో ఆయన వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అవలీలగా అందుకోగలడు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.