Devi Sri Prasad: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో బాక్సాఫీసులు బద్దలుకొట్టేస్తోంది. కాగా, ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌కు చేరుకుని రికార్డు సృష్టించింది. కాగా, మరోవైపు ఈ పాట మగవాళ్లను తక్కువ చేస్తన్నట్లు ఉందంటూ.. పలువురు విమర్శిస్తూ కేసులు కూడా పెట్టారు. ఇదంతా పక్కన పెడితే..
పుష్ప సినిమా ప్రమోషన్స్లోభాగంగా మ్యూజిక్ డైరకెట్ర్ దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో వివాదానికి దారి తీశాయి. ఐటెం సాంగ్‌ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దేవి శ్రీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే దేవి తన తప్పును ఒప్పుకుని హిందువులకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే బయట ఒక్క అడుగు కూడా పెట్టలేడని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఊ అంటావా సాంగ్ మేల్ వెర్షన్…
ఐటెం సాంగ్‌ను భక్తి గీతాలతో పోల్చడం ఏంటని.. దీనిపై హిందువులు చాలా కోపంగా ఉన్నారని రాజాసింగ్ అన్నారు. ఈ విషయంపై దేవి క్షమాపణలు చెప్పకపోతే.. తెలంగాణ ప్రజలు చెప్పులతో తరిమి కొడతారని హెచ్చరించారు. పుష్ప ఐటెం సాంగ్‌లోని లిరిక్స్‌ను దేవుడి శ్లోకాలతో పోల్చడం సిగ్గుచేటని ఆరోపించారు. ఇటీవలే పుష్ప సినిమా ప్రమోషన్స్‌లో దేవి శ్రీ.. రింగ రింగా, ఊ అంటావా మావా, ఈ రెండు పాటలను భర్తి పాటలుగా మార్చి పాడారు. అంతటితో ఆగకుండా.. ఐటెం సాంగ్స్, దేవుడి పాటలు తన దృష్టిలో ఒకటేనని అన్నారు. దీంతో దేవిశ్రీపై సోషల్‌మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.