Pushpa 2: సుక్కు – బన్నీ ‘పుష్ప 2’ను ఏం చేయబోతున్నారు ?

Pushpa 2:  ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలోనే రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందనే కోణంలో వచ్చిన కామెంట్స్ ను చూస్తే మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. పుష్ప ట్రైల‌ర్‌ లో నటుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ ‘పార్టీ లేదా పుష్పా’ అంటూ చెప్పిన డైలాగ్ […]

Written By: Shiva, Updated On : December 18, 2021 7:28 pm
Follow us on

Pushpa 2:  ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలోనే రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందనే కోణంలో వచ్చిన కామెంట్స్ ను చూస్తే మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి.

Pushpa 2

పుష్ప ట్రైల‌ర్‌ లో నటుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ ‘పార్టీ లేదా పుష్పా’ అంటూ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఒక విధంగా ట్రెండ్ అయింది కూడా. అందుకే, ఆ డైలాగ్ ని మీమ‌ర్స్ కూడా బాగా వాడుకుని ర‌క‌ర‌కాలుగా మీమ్స్ చేసి వదిలారు. అయితే, పుష్ప నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే, అదే డైలాగ్ ను మీమర్స్ ఇప్పుడు మరోలా వాడుతున్నారు.

పార్టీ లేదా పుష్పా కాస్తా, పార్ట్ 2 లేదా పుష్పా అని మార్చి ఫన్నీ మీమ్స్ ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మరి సుక్కు – బన్నీ ‘పుష్ప2’ పై ఏం చేయనున్నారు ? అనే కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. నిజానికి అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌ అంటేనే ఫుల్ క్రేజ్. అంచనాలు బారీగా ఉంటాయి.

ఆ అంచనాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అందుకే, పుష్ప టాక్ విషయంలో కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ఏది ఏమైనా పార్ట్ 1 అంచ‌నాల‌ను అందుకోలేకపోయింది. అందుకే, పార్ట్ 2 ఉందా, లేదా అని అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అయితే, ఇప్పటికే పుష్ప పార్ట్ 2 షూటింగ్ కూడా అయిపోయింది. కాబట్టి.. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.

Also Read: Karan Johar: రాజమౌళి మన మధ్య ఉండటం.. భారతీయ సిసీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం- కరణ్ జోహార్​

కానీ పుష్ప పార్ట్ 2 పై భారీ ఒత్తిడి ఉంటుంది. ఎలాగూ పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు మార్పులు చేర్పులు చేయడానికి కుదరదు. మరి సుక్కు – బన్నీ ‘పుష్ప 2’ ఏమి చేస్తారో చూడాలి.

Also Read: Samantha: సమంత అందుకే అంత ప్రత్యేకం… సక్సెస్ సీక్రెట్ అదే!

Tags