https://oktelugu.com/

Inter Examinations: ఇంటర్ పరీక్షల్లో ‘ఫెయిల్’ అయిందెవరు?

Inter Examinations: తెలంగాణలో ఇంటర్మీయట్ తొలి సంవత్సరం పరీక్షలు ఫలితాలు తాజాా విడుదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంటర్మీయట్ విద్యార్థులు ఈ ఏడాది ఫెయిలవడం శోచనీయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే 51శాతం విద్యార్థులు ఫెయిల్ కాగా కేవలం 49మంది విద్యార్థులు మాత్రమే ఉత్తర్ణత సాధించారు. అయితే ఇంటర్మీయట్ ఫలితాలపై ప్రస్తుతం వివాదం రాజుకుంటోంది. కరోనా సమయంలో అరకొర సదుపాయాల మధ్య ఇంటర్మీయట్ బోర్డు(Inter Examinations) విద్యార్థులకు పరీక్షలను నిర్వహించిందని విద్యార్థి సంఘాల నాయకులు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2021 12:39 pm
    Follow us on

    Inter Examinations: తెలంగాణలో ఇంటర్మీయట్ తొలి సంవత్సరం పరీక్షలు ఫలితాలు తాజాా విడుదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంటర్మీయట్ విద్యార్థులు ఈ ఏడాది ఫెయిలవడం శోచనీయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే 51శాతం విద్యార్థులు ఫెయిల్ కాగా కేవలం 49మంది విద్యార్థులు మాత్రమే ఉత్తర్ణత సాధించారు. అయితే ఇంటర్మీయట్ ఫలితాలపై ప్రస్తుతం వివాదం రాజుకుంటోంది.

    Inter Examinations

    Inter Examinations

    కరోనా సమయంలో అరకొర సదుపాయాల మధ్య ఇంటర్మీయట్ బోర్డు(Inter Examinations) విద్యార్థులకు పరీక్షలను నిర్వహించిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లు కళాశాలల్లో ఆన్ లైన్ క్లాసులు సజావుగా జరుగలేదని, అలాగే సిలబస్ పూర్తయిన ఆరునెలలకు ప్రభుత్వం ఇంటర్మీయట్ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని తల్లిదండ్రులు  చెబుతున్నారు.

    ఈక్రమంలోనే విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రుల హైదరాబాద్లోని ఇంటర్మీయట్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు సైతం కొన్నింట్లో ఫెయిల్ అయ్యారని తెలిపారు. కొందరికి పదిలోపు, సున్నలోపు మార్కులు రావడాన్ని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

    విద్యార్థుల పేపర్లను దిద్దటంలో ఇంటర్మీయట్ బోర్డు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుందని విమర్శించారు. కార్పొరేట్ కళాశాలల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇంటర్మీయట్ పరీక్షలు నిర్వహించిందని ఆరోపించారు. కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసులు సజావుగా నిర్వహించకుండా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం వల్లే విద్యార్థులు ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యారనే వాదనలను విన్పిస్తున్నారు.

    Also Read: ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఏడు పేపర్లు మాత్రమే?

    కాగా ఈ ఫలితాల్లో ఎప్పటిలాగే అమ్మాయిలు పైచేయి సాధించారు. బాలురు కేవలం 42శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 56శాతం ఉత్తర్ణత సాధించారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యార్థుల ఉత్తర్ణత శాతం కేవలం 49శాతానికే పరిమితం కావడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొందరు విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో బలవర్మణాలకు పాల్పడుతుండటం ఆందోళనను రేపుతోంది.

    ఇదిలా ఉంటే ఇంటర్మీయట్ బోర్డు మాత్రం సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం నష్టపోయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇంటర్మీయట్ బోర్డు నిర్లక్ష్యంగా కొట్టొచ్చినట్లు కన్పిస్తుండటంతో ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.

    Also Read: టెన్త్ పరీక్షల్లో ఏడు పేపర్లు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!