Photo Story: ఈ ఫొటోలో ఉన్న తెలుగు స్టార్ ఎవరో గుర్తుపట్టండి..?

సినిమాల్లోకి రావాలని అందరికీ ఉంటుంది. కానీ అనుకున్న పొజిషన్లో దాదాపు ఎవరూ ఉండరు. కొందరు హీరో అవుదామని వస్తారు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోతారు. మరికొందరు డైరెక్టర్ అవుదామని వస్తారు.. కానీ హీరోగా రాణిస్తారు. రెండో కోవకి చెందిన ఓ హీరో అలాగే వచ్చారు. ఇందులో భాగంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత వర్కౌట్ కాకపోవడంతో హీరోగా నటించి.. ఆ తరువాత స్టార్ అయ్యాడు. అతనెవరో కాదు స్టార్ హీరో నాని.

Written By: Chai Muchhata, Updated On : July 25, 2023 3:46 pm

Photo Story

Follow us on

Photo Story: సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న వాళ్లలో చాలా మంది గాడ్ ఫాదర్ సహయంతో వచ్చిన వాళ్లే. అయితే ఎలాంటి అండా దండా లేకున్నా సినిమా స్టార్లు అయిన వాళ్లూ ఉన్నారు. అయితే వారిని వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఇలాంటి విషయంలో మొట్టమొదటగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతారు. ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకున్నా మెగాస్టార్ అంతటి వారయ్యారంటే ఆయన స్వయం కృషి అని మాత్రమే చెబుతారు. అయితే మెగాస్థార్ చిరంజీవి తరువాత కూడా చాలా మంది వచ్చారు. ఇప్పుడు మరో స్టార్ కూడా ఆయనలాగే పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు సంబంధించిన ఓ ఓల్డ్ పిక్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసుకోండి..

సినిమాల్లోకి రావాలని అందరికీ ఉంటుంది. కానీ అనుకున్న పొజిషన్లో దాదాపు ఎవరూ ఉండరు. కొందరు హీరో అవుదామని వస్తారు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోతారు. మరికొందరు డైరెక్టర్ అవుదామని వస్తారు.. కానీ హీరోగా రాణిస్తారు. రెండో కోవకి చెందిన ఓ హీరో అలాగే వచ్చారు. ఇందులో భాగంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత వర్కౌట్ కాకపోవడంతో హీరోగా నటించి.. ఆ తరువాత స్టార్ అయ్యాడు. అతనెవరో కాదు స్టార్ హీరో నాని.

నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. ఏపీలోని కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జన్మించిన ఈయన సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. అయితే ఆ తరువాత డైరెక్టర్ కావాలన్న ఆశతో డైరెక్టర్ బాపు దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. ఆ తరువాత రేడియో జాకీగా పనిచేశాడు. అయితే ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘అష్టాచెమ్మా’ అనే సినిమాలో సైడ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో తన ఫర్ఫామెన్స్ చూపించడంతో మరో మూవీ రైడ్ లో నటించారు. ఇందులో కూడా రెండో హీరోగ నటించారు.

2009లో స్నేహితుడా అనే సినిమాలో మెయిన్ హీరోగా నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. అయితే ‘అలా మొదలైంది’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి నాని దశ తిరిగింది. వరుసగా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘దసరా’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ‘హాయ్ నాన్న ’ సినిమాతో వెండితెరపై కనిపించబోతున్నాడు.

నాని ఫ్యామిలీ విషయానికొస్తే ఆయన సినిమాల్లో నటిస్తుండగానే 2012లో యలవర్తి అంజనాను పెళ్లి చేసుకున్నారు. ఈమె భర్తకు ఎంత సపోర్టుగా ఉంటుంది. అయితే అంజానా కూడా ఊరికే ఇంట్లో కూర్చోలేదు. ఆర్కే మీడియాలో క్రియేటివ్ హెడ్ గా ఉన్నారు. బాహుబలి సినిమాకు ఈమె పనిచేశారు. అయితే పెళ్లయిన కొత్తలో వీరు తీసుకున్న ఫొటో ఇది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.