https://oktelugu.com/

Miss You Movie Trailer: మిస్ యూ ట్రైలర్ రివ్యూ: సిద్దార్థ్ ఈజ్ బ్యాక్, ఆ రోజులు గుర్తు చేశాడే, హిట్ పక్కా!

హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ మిస్ యూ. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. మిస్ యూ ట్రైలర్ విడుదల చేశారు. సిద్ధార్థ్ పాత రోజులు గుర్తుకు చేశాడు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో తన అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యాడు. మరి మిస్ యూ ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 24, 2024 / 11:16 AM IST

    Miss You Movie Trailer

    Follow us on

    Miss You Movie Trailer: బాయ్స్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన సిద్ధార్థ్ తెలుగులో కూడా ఫేమ్ తెచ్చుకున్నాడు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బాయ్స్ టాలీవుడ్ ఆడియన్స్ ని సైతం మెప్పించింది. అనంతరం నువ్వొస్తానంటే నేనొద్దంటానా టైటిల్ తో స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ చేశాడు సిద్దార్థ్. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. త్రిష హీరోయిన్ కాగా, శ్రీహరి కీలక రోల్ చేశాడు.

    సిద్ధార్థ్ నటించిన మరో తెలుగు చిత్రం బొమ్మరిల్లు. దిల్ రాజు నిర్మించిన బొమ్మరిల్లు మరో బ్లాక్ బస్టర్. లవ్ స్టోరీస్ లో ట్రెండ్ సెట్టర్. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ లవ్ డ్రామా యువతకు తెగ నచ్చేసింది. అనంతరం వరుసగా పలు తెలుగు చిత్రాల్లో సిద్ధార్థ్ నటించాడు. అయితే ఆయన నుండి బొమ్మరిల్లు స్థాయి చిత్రాలు రాలేదు. పరాజయాల నేపథ్యంలో టాలీవుడ్ కి దూరమయ్యాడు. ఆ మధ్య చాలా గ్యాప్ తర్వాత మహాసముద్రం చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశాడు.

    తెలుగులో మార్కెట్ కోల్పోయిన సిద్ధార్థ్ తమిళంలో మాత్రమే నటిస్తున్నారు. కాగా సిద్ధార్థ్ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేసి చాలా కాలం అవుతుంది. తన అభిమానుల కోసం ఎట్టకేలకు ఆ జానర్ లో సినిమా చేశాడు. మిస్ యూ టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో సిద్ధార్థ్-ఆషిక రంగనాథ్ జంటగా నటించారు. ఆషిక ఇటీవల నా సామిరంగా మూవీలో నటించిన సంగతి తెలిసిందే.

    మిస్ యూ మూవీ నవంబర్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఆషిక ప్రేమ కోసం పరితపించే అబ్బాయిగా సిద్ధార్థ్ పాత్ర ఉంది. సిద్ధార్థ్ పాత రోజులను గుర్తు చేశాడు. ఈసారి మిస్ యూ మూవీతో సిద్ధార్థ్ సాలిడ్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు. మిస్ యూ చిత్రానికి ఎన్. రాజశేఖర్ దర్శకుడు. ఇక జిబ్రాన్ మ్యూజిక్ అందించారు. శామ్యూల్ మ్యాథ్యూ నిర్మిస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఈ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.