Jagan: ప్రపంచంలో ఎక్కడ ఏ మూల అవినీతి జరిగినా..దాని మూలం ఏపీలో తేలడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అమెరికాలో అదానీ అవినీతి బయటపడితే.. ఏపీలో సైతం దాని మూలాలు తేలడం విశేషం. గత ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన వైసిపి రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పరిణామాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఒకే డీల్ తో అదాని నుంచి 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడం చిన్న విషయం కాదు. భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానిపై అమెరికాలో లంచం కేసు నమోదయింది. అమెరికాలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు పేరుతో అక్రమ మార్గంలో నిధులు రాబెట్టారని.. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 25 మిలియన్ డాలర్ల లంచాలను ఆఫర్ చేశారని.. అదానితో పాటు మరో ఏడుగురిపై అమెరికాలో కేసు నమోదయింది. అయితే ఆ కేసు తీగ అక్కడ కదిలితే ఏపీలో జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల డొంక కదిలింది. అతని 20 ఏళ్లలో ఏకంగా రెండు బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకుగాను అధికారులకు 265 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 2236 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అన్నది అభియోగం.
* ఏపీలో మూలం
అయితే అమెరికాలో నమోదైన ఈ కేసులో మూలం ఏపీలో బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.ఏపీలో 40,000 కోట్ల రూపాయలతో సోలార్ ప్లాంట్లు పెట్టాలని జగన్ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. దీని వెనుక 175 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారతదేశ చరిత్రలోనే ఒక డీల్ లో ఇంతటి భారీ లంచం ఇవ్వడం, తీసుకోవడం, ఇటువంటి అభియోగాలు రావడం ఇదే తొలిసారి.అయితే ఇదే జగన్.. ఆధారాలు లేని అవినీతి కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేయడం విశేషం. ఈ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును దాదాపు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉంచేశారు.
* తెర వెనుక ఓ ఉన్నతాధికారి
జగన్ పై అవినీతి కేసులు కొత్త కాదు. కానీ ఏకంగా అమెరికాలో నమోదైన కేసులో.. జగన్ పేరు బయటపడటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ డీల్ వెనుక ఏపీకి చెందిన ఒక ఉన్నతాధికారి ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో సి ఎం ఓ అన్ని చూసేదని.. తమ ప్రమేయం లేదని అప్పట్లో ఇంధన శాఖామంత్రిగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా వెల్లడించారు. అంటే నేరుగా జగన్ డీల్ కుదుర్చుకున్నారు అన్నమాట. కానీ ఆయన మాట చూస్తుంటే దొంగే.. దొంగ అన్నట్టు ఉంది.