https://oktelugu.com/

Rajinikanth: రజినీకాంత్ కి విలన్ గా తెలుగు హీరోలు మాత్రమే కావాలా..? జైలర్ 2 సినిమాలో విలన్ గా ఆ స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు... ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది స్టార్ హీరోలు వరుస సినిమాలను చేస్తూ స్టార్ డమ్ ని సంపాదించుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 / 11:05 AM IST

    Rajinikanth

    Follow us on

    Rajinikanth: తమిళ్ స్టార్ హీరో అయిన రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఆయన చేసిన చాలా సినిమాలు తమిళ్, తెలుగులో సూపర్ సక్సెస్ లను సాధించాయి. సూపర్ స్టార్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రజనీకాంత్ ప్రస్తుతం 73 సంవత్సరాల వయసులో కూడా హీరోగా అదరగొడుతూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ‘లోకేష్ కనకరాజ్’ డైరెక్షన్ లో ‘కూలీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి కావస్తుంది. ఇక రజనీకాంత్ ఈ సినిమాలో ఒక డాన్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ను ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు రజినీకాంత్ కు కూడా భారీ సక్సెస్ ని కట్టబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

    నాగార్జునకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో నాగార్జున స్టైలిష్ విలన్ గా నటించడమే కాకుండా రజినీకాంత్ ను ఢీకొట్టే పాత్రలో విలనిజాన్ని కూడా పండించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికి లోకేష్ కనకరాజు సినిమాలో విలన్ అంటే విక్రమ్ సినిమాలో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర మనకు గుర్తుకు వస్తుంది.

    ఇక ఈ సినిమాలో సూర్య చేసింది ఐదు నిమిషాల పాత్రే అయినప్పటికి ఆ సినిమా మొత్తంలో ఆయన పాత్రకి విపరీతమైన గుర్తింపైతే వచ్చింది. అందుకే నాగార్జున కూడా ఆయన సినిమాలో విలన్ గా నటించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ కి మాత్రం కూలీ సినిమాలో నాగార్జున విలన్ గా చేయడమే కాకుండా తన తదుపరి సినిమాలో కూడా తెలుగు హీరోనే విలన్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తన తదుపరి సినిమా అయిన జైలర్ 2 సినిమాలో ఒకప్పటి తెలుగు స్టార్ హీరోలు అయిన రాజశేఖర్ గాని, లేదంటే శ్రీకాంత్ ను గాని ఇందులో విలన్ గా తీసుకోవాలనే ఆలోచనలో రజనీకాంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలుగు హీరోలతో విలనిజాన్ని చేయిస్తే అటు తమిళ్, ఇటు తెలుగు రెండు మార్కెట్లు కూడా భారీగా వర్కౌట్ అవుతాయనే ఉద్దేశ్యంతోనే రజినీకాంత్ ఇలాంటి ప్లాన్ చేస్తున్నాడట… ఇక దానికి తోడుగా తమిళం లో విలన్స్ తో నటించి రొటీన్ గా అనిపిస్తుండడంతో కొత్తదనం కోసం మన తెలుగు నటులను సెలెక్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…