https://oktelugu.com/

Miss Shetty Mr Polishetty Collections: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి 8వ కలెక్షన్స్ : సూపర్ హిట్ దిశగా అనుష్క మూవీ!

స్టార్ హీరోల సినిమాలు వేరు, ఒక్కోసారి మిక్స్డ్ టాక్ వచ్చిన ఎలాగోలా బయట పడతాయి. కానీ ఈ సినిమా పరిస్థితి వేరు. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన కానీ ఆమె ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చిన సంఘటనలు లేవు.

Written By:
  • Shiva
  • , Updated On : September 15, 2023 / 01:04 PM IST

    Miss Shetty Mr Polishetty Collections

    Follow us on

    Miss Shetty Mr Polishetty Collections: కొన్ని సినిమాలను గమనిస్తే మొదటి రోజు మొదటి షో కి వచ్చే టాక్ కి ఫైనల్ రన్ లో ఈ చిత్రానికి వచ్చే వసూళ్ళకు అసలు సంబంధం అనేది ఉండదు. తెలుగు పరిశ్రమలో చాలా సినిమాల విషయంలో అలాగే జరిగాయి. రీసెంట్ గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది. ఈ సినిమా కు మొదటి నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇలాంటి టాక్ వచ్చిన సినిమా ఎనిమిదో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించటం అంటే గొప్ప విషయమే

    స్టార్ హీరోల సినిమాలు వేరు, ఒక్కోసారి మిక్స్డ్ టాక్ వచ్చిన ఎలాగోలా బయట పడతాయి. కానీ ఈ సినిమా పరిస్థితి వేరు. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన కానీ ఆమె ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చిన సంఘటనలు లేవు. పైగా ఆమెకు తెలుగులో బాహుబలి తర్వాత సరైన హిట్ అనేది లేదు. ఇక ఇందులో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి కి విషయం ఉంది కానీ, మిడ్ రేంజ్ హీరో స్థాయికి చేరలేదు. ఇలాంటి స్థితిలో కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టడీ గా నిలబడింది అంటే దానికి కారణం కంటెంట్ .

    పిల్లలు కావాలంటే పెళ్లి అవసరం లేదు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా జాగ్రత్త పడ్డారు. దీనితో ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇక కలెక్షన్స్ విషయానికి ఈ సినిమా ఎనిమిదో రోజు బాక్సాఫీస్ దగ్గర రమారమి 1. 2 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. దీనితో ఓవరాల్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 18 కోట్ల నెట్ వసూళ్లు చేసింది.

    మరోపక్క ఓవర్శిస్ లో కూడా భారీ వసూళ్లు చేస్తుంది ఈ సినిమా ఇప్పటికే వన్ మిలియన్ క్లబ్ లోకి చేరిన ఈ సినిమా. త్వరలోనే 1.5 మిలియన్ మార్క్ టచ్ చేయడం ఖాయం. ఇక తెలుగులో ఈ సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా చేస్తున్నారు. కొన్ని సెలెక్ట్ చేసిన థియోటర్లో మహిళలకు ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ వారం తెలుగు లో చెప్పుకోదగిన సినిమాలు పెద్దగా రిలీజ్ కావడం లేదు. దీనితో ఈ వీకెండ్ కూడా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.