https://oktelugu.com/

Miss Shetty Mr Polishetty Collections: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 7వ రోజు వసూళ్లు… బాక్సాఫీస్ దగ్గర స్టడీగా అనుష్క మూవీ!

ఈ సినిమా ఏడో రోజు కూడా మంచి వసూళ్లు చేసింది. తెలుగు బాక్సాఫీస్ దగ్గర 1 . 3 కోట్ల కలెక్షన్స్ సాధించి హౌరా అనిపించింది. నిజానికి ఈ సినిమా కు మొదటి లో పెద్ద హిట్ టాక్ ఏమీ రాలేదు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 14, 2023 / 12:43 PM IST

    Miss Shetty Mr Polishetty Collections

    Follow us on

    Miss Shetty Mr Polishetty Collections: ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని చెబుతూ అనేక సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మెరిశాయి. ఇప్పుడు పిల్లలకు పెళ్లి తో సంబంధం లేదని చెబుతూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతోంది. సీనియర్ అగ్ర హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన ఈ సినిమా గత వారం విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దానికి తగ్గట్లే వసూళ్లు సాధిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది.

    ఈ సినిమా ఏడో రోజు కూడా మంచి వసూళ్లు చేసింది. తెలుగు బాక్సాఫీస్ దగ్గర 1 . 3 కోట్ల కలెక్షన్స్ సాధించి హౌరా అనిపించింది. నిజానికి ఈ సినిమా కు మొదటి లో పెద్ద హిట్ టాక్ ఏమీ రాలేదు. ఎలాగోలా వీకెండ్ నడిచి కొద్దోగొప్పో వసూళ్లు వస్తాయేమో అనుకున్నారు. కానీ ఈ సినిమాకు యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో ఊహించని విధంగా కలెక్షన్స్ పెరిగాయి. దానికి తోడు మౌత్ టాక్ తోడుకావడంతో సినిమా మెల్లగా పైకి లేచింది.

    ఇప్పటివరకు ఈ సినిమా ఇండియా వైడ్ గా 16. 6 కోట్ల నెట్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. మరోపక్క ఓవర్శిస్ లో కూడా భారీ వసూళ్లు చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్లు క్లబ్ లోకి చేరింది ఈ సినిమా. ఇంకా అక్కడ స్టడీ గా కొనసాగుతుంది ఈ సినిమా. ఈజీగా 1. 5 మిలియన్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఇండియా లో కూడా 22 నుంచి 25 కోట్ల ఫైనల్ వసూళ్లు ఉండవచ్చని తెలుస్తోంది.

    ఇక రాబోయే వీకెండ్ ఈ సినిమాకు మంచి వసూళ్లు రావచ్చు. ఈ శుక్రవారం కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. వాటి టాక్ ను బట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కలెక్షన్స్ ఆధారపడి ఉండవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ విడుదల అయిన రోజే ఈ సినిమా విడుదల అయ్యింది. మొదటి ఆరు రోజులు జవాన్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో తెలుగు కలెక్షన్స్ చేసిన ఈ సినిమా ఏడో మాత్రం జవాన్ ని మించిన వసూళ్లు చేసి తన సత్తా చాటింది