Pedda Kapu 1: సీనియర్ ఎన్టీఆర్ టీడీపీకి.. ‘పెదకాపు-1′ సినిమాకి మధ్యలో ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

శ్రీకాంత్ అద్దాల అంటే సినిమాలు తప్పక బాగుంటాయి అనే ఉద్దేశం ప్రేక్షకులకు కలుగుతూ ఉన్నప్పుడు.. ముకుంద, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు చేసి తన పైన ప్రేక్షకులకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను తగ్గించుకునేసాడు.

Written By: Swathi, Updated On : September 14, 2023 12:41 pm

Pedda Kapu 1

Follow us on

Pedda Kapu 1: కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ శ్రీకాంత్ అద్దాల. మొదటి సినిమాతోనే యూత్ ని అలానే ఫ్యామిలీని ఆకట్టుకొని సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఈ దర్శకుడు.

శ్రీకాంత్ అద్దాల అంటే సినిమాలు తప్పక బాగుంటాయి అనే ఉద్దేశం ప్రేక్షకులకు కలుగుతూ ఉన్నప్పుడు.. ముకుంద, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు చేసి తన పైన ప్రేక్షకులకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను తగ్గించుకునేసాడు. ముఖ్యంగా బ్రహ్మోత్సవం సినిమాతో అటు మహేష్ బాబు కి ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పటికీ మరువలేని డిజాస్టర్ ఇచ్చారు.

ఇక ఆ తరువాత అసలు శ్రీకాంత్ అద్దాల దర్శకుడుగా మరో సినిమా చేస్తారో లేదో అనే సందేహం ఉన్నప్పుడు.. వెంకటేష్ తో రీమేక్ సినిమా నారప్ప చేసి ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసి పరవాలేదు అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా దర్శకునిగా అలానే నటుడుగా పక్కా మాస్ సినిమా పెద్దకాపు అని చేస్తున్నాడు.

ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. ముఖ్యంగా ఈ సినిమాకి ఒక వర్గం పేరునే టైటిల్ గా పెట్టడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు ఈ చిత్రం గురించి చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ముందుగా ఈ సినిమా దర్శకుడు గురించి చెబుతూ..”తన సినిమాల్లానే శ్రీకాంత్ చాలా కూల్‌గా ఉంటారు. నాకొక కె.విశ్వనాథ్ గారిలా అనిపిస్తారు. అయితే ‘నారప్ప’తో ఆయనలో ఒక కొత్త దర్శకుడిని చూశాను. ‘పెదకాపు-1’ కథ చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ట్రైలర్‌లో ఏది చూశామో అంత ఇంటెన్స్‌గా చెప్పారు. ఈ సినిమాతో ఆయన నటన కూడా మొదలుపెట్టారు. శ్రీకాంత్ ఇలాంటి ఒక సినిమా డైరెక్టర్ చేసి, ఇలాంటి ఔట్‌పుట్ ఇవ్వడం ఒక కెమెరామెన్‌గా నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది” అని తెలియజేశారు ఛోటా.

ఇక ఆ తరువాత ఈ సినిమాతో సీనియర్ ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశం కి ఉండే సంబంధం గురించి చెబుతూ..”ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మొదలైన అంశాన్ని ఈ కథగా తీసుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. రామారావుకు శ్రీకాంత్ అడ్డాల తండ్రి పెద్ద అభిమాని. రామారావు పార్టీ పెట్టిన రోజుల్లో శ్రీకాంత్ తండ్రి పడిన కష్టం, ఆయన ప్రవర్తన, ఆయనకి చుట్టుపక్కల నుంచి ఎదురైన సంఘటనలపై శ్రీకాంత్‌కి మంచి పట్టుంది. వాటి స్ఫూర్తితో ఈ కథని రాసుకున్నారు ఆయన” అని చెప్పుకొచ్చారు చోటా కె నాయుడు.