Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం నామినేషన్ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఒకరినొకరు నామినేట్ చేయడమే కాకుండా దానికి కారణ కారణాలను కూడా చెప్పాల్సి వస్తుంది. అయితే నామినేషన్ అంతా ఒకేసారి కాకుండా విడతల వారీగా జరుగుతుంది. దీంతో ప్రస్తుతం హౌస్ లో పరిస్థితి చాలా వేడిగా మారింది. మరోపక్క పవర్ అస్త్రా సాధించిన ఆట సందీప్ నామినేషన్ నుంచి బయటపడ్డాడు.
అయితే అతనికి పూర్తిగా ప్రమాదం తప్పలేదు అని తెలియపరుస్తూ ఒక బ్యాటరీ మెలికను పెట్టాడు బిగ్ బాస్. పర్ఫామెన్స్ మీద ఆధారపడి బ్యాటరీ చార్జింగ్ ఉంటుందని…ఆ చార్జింగ్ ని ఆధారపడి అతని ఇమ్యూనిటీ ఉంటుందని తేల్చి చెప్పాడు. అంతేకాకుండా ఈ సీజన్లో ఫస్ట్ హౌస్ మేట్ గా అవ్వడంతో పాటు ఆట సందీప్ కు బిగ్ బాస్ మరొక స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది.
ఆ స్పెషల్ పవర్ ప్రకారం ఆటో సందీప్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరినో ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరిని నామినేట్ చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిన సందీప్ చివరకు ప్రిన్స్ ను నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేయాల్సి వస్తుందో సందీప్ కారణాలు చెప్పాడు. అయితే వీటికి స్పందించిన ప్రిన్స్ కావాలని సందీప్ తనని టార్గెట్ చేస్తున్నాడు అని అభియోగించాడు.
మొత్తానికి నిన్న ఎపిసోడ్లో నామినేషన్స్ పర్వం పూర్తిగా ఒకరిపై ఒకరు అభియోగాలతో…ఫుల్ ఎంటర్టైనర్ గా సాగింది. ఇంతకీ ప్రిన్స్ యావర్ ను నామినేట్ చేయడానికి అతను చెప్పిన కారణం అన్ని టాస్కులలో నాగార్జున గారు కూడా ప్రిన్స్ కి తక్కువ మార్కులు వేయడమే. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న అందరికంటే పోల్చుకుంటే హౌస్ లో జరిగే టాస్క్లపరంగా ప్రిన్స్ కాస్త వీక్ అనేది సందీప్ అభిప్రాయం.
అయితే తనపై ఆట సందీప్ చెప్పినా మాటలకు ప్రిన్స్ కాస్త రియాక్ట్ అయ్యాడు. నాగ్ సార్ నాకు 69 మార్కులు ఇచ్చారు.. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంకా ఉన్నారు.. అయినా ఏ బేసిస్పై నన్ను అందరికంటే వీక్ అని మీరు అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. అంతేకాకుండా కావాలని సందీప్ తనని టార్గెట్ చేస్తున్నాడు అని ప్రిన్స్ అన్నాడు.
దీనికి సందీప్ “నాకు నిన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు.. ఒకవేళ నేను చేయాలి అనుకుంటే పల్లవి ప్రశాంత్ ని ఇప్పుడు టార్గెట్ చేసి ఉండొచ్చు. కానీ నా ఉద్దేశం టార్గెట్ చేయడం కాదు…”అని క్లారిటీ ఇచ్చాడు. అయినా కన్విన్స్ కానీ ప్రిన్స్ ఇంతకుముందు సాండ్ పోసే విషయంలో మనసులో ఏదో పెట్టుకుని ఆట సందీప్ ఇప్పుడు తనపై ఇలా టార్గెట్ చేస్తున్నాడు అని వాదించాడు. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య కాసేపు వాదన జరిగాక చివరకు ప్రింట్స్ నామినేట్ అవ్వడం జరిగింది.