India Vs Pakistan: ఇండియా పాకిస్తాన్ కి మధ్య రేపు జరగబోయే మ్యాచ్ లో రిజర్వ్ డే ఉంటుంది అని ఐసీసీ ఒక మంచి న్యూస్ చెప్పింది.అసలు రిజర్వ్ డే అంటే ఏంటి అంటే ఒక రోజు జరగాల్సిన మ్యాచ్ కొద్దిసేపు ఆడిన తర్వాత వర్షం కారణం గా ఆగిపోతే ఆ మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి నెక్స్ట్ డే మళ్లీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది దాన్నే రిజర్వ్ డే అంటారు. ఒకవేళ మొదటి రోజు మ్యాచ్ మొత్తానికే జరగపోయిన కూడా రిజర్వ్ డే రోజు మొదటి నుంచి మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఉంది…
అయితే మన ఇండియా టీం ఇప్పటికే 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ మీద ఆడిన సెమి ఫైనల్ మ్యాచ్ లో ఆల్రెడీ ఒకసారి రిజర్వ్ మ్యాచ్ ఆడటం జరిగింది కాబట్టి మన టీం కి రిజర్వ్ డే మ్యాచ్ ఆడటం ఇది కొత్త ఏమి కాదు.ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం నిర్ణిత 50 ఓవర్లకి 239 పరుగులు చేసింది.ఇక ఆ తర్వాత మనవాళ్లు బ్యాటింగ్ కి వచ్చినప్పుడు వర్షం వచ్చింది దాంతో రిజర్వ్ డే కింద మనవాళ్ళు నెక్స్ట్ డే బ్యాటింగ్ చేయడం జరిగింది.240 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన మనవాళ్ళు ఇంకో మూడు బాల్స్ మిగిలి ఉండగానే 221 పరుగులకే ఆలౌట్ అయిపోయారు. నిజానికి మన టీం కి 240 రన్స్ ని ఛేజ్ చేయడం పెద్ద కష్టం ఏమి కాదు కానీ వర్షం వల్ల పిచ్ అనేది బ్యాటింగ్ కి అనుకూలించలేదు అందుకే ఆ రోజు జడేజా ఎంత కష్టపడినా చివరికి మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది…
ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్ లో ఈ రిజర్వ్ డే వల్ల ఎవరికీ లాభం ఉంటుంది అంటే మొదట బ్యాటింగ్ చేసిన టీం కి చాలా వరకు లాభం ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసినా వాళ్ళకి పిచ్ కొంచం డ్రై గా ఉండటం వల్ల బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. కానీ రిజర్వ్ డే లో ఆడే వాళ్ళకి ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ కి పిచ్ మొత్తం తడి గా ఉండడం వల్ల బాల్ బ్యాట్ మీద కి సరిగ్గా రాదు. దాంతో పిచ్ కూడా చాలా స్లో గా మారిపోతుంది. కాబట్టి బ్యాట్స్మెన్స్ కి స్కోర్ చేయడం చాలా కష్టం అవుతుంది.సరిగ్గా 2019 వరల్డ్ కప్ లో మనవాళ్ళు రిజర్వ్ డే మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఇలాగె జరిగింది…ఇక ఏషియా కప్ లో ఆడుతున్న ఈ ఒక్క మ్యాచ్ కి అనే కాదు సూపర్ 4 లో ఆడుతున్న అన్ని మ్యాచులకి వర్షం అడ్డంకి అయితే ఉంది కానీ అన్ని మ్యాచులకి రిజర్వ్ డే ఇవ్వడం కుదరదు కాబట్టి ఈ ఒక్క మ్యాచ్ కి ఇవ్వడం జరిగింది.ఇక ఇది మినహా ఇస్తే ఫైనల్ మ్యాచ్ కి కూడా రిజర్వ్ డే ప్రకటించింది.ఒక వేళా రేపు జరిగే పాకిస్థాన్ ఇండియా మ్యాచ్ లో రిజర్వ్ డే మ్యాచ్ కనక ఆడితే మనవాళ్ళు వరుసగా మూడు రోజులు మ్యాచులు ఆడాల్సి వస్తుంది 10 ,11 వ తేదీల్లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడితే 12 వ తేదీన శ్రీలంక తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఇక సూపర్ 4 లో ఐసీసీ ఈ ఒక్క మ్యాచ్ కె ఎందుకు రిజర్వ్ డే ప్రకటించింది అంటే ఈ మ్యాచ్ కి ఉన్న ఫాలోయింగ్ అలాంటింది. ఇప్పటికే లీగ్ లో ఈ రెండు జట్ల మధ్య ఒక భారీ మ్యాచ్ జరిగినప్పటికీ అది కూడా వర్షం కారణం గా రద్దవ్వడం తో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురి అయ్యారు. ఇక ఈ మ్యాచ్ లో కూడా ఫలితం తెలియక పోతే వాళ్ళు ఇక మిగిలిన మ్యాచులు చూడటం కూడా ఆపేస్తారు అలాగే మేనేజిమెంట్ కి కూడా భారీ గా లాస్ వస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే ప్రకటించింది. ఇక ఫైనల్ మ్యాచ్ కి కూడా రిజర్వ్ డే ఉండటం తో ఫైనల్ కి ఎవరస్తే వాళ్ళు కూడా రిజర్వ్ డే మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
అయితే మ్యాచ్ లో ఎవరు మొదటి బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇక ఇప్పటి వరకు కురిసిన వర్షం కారణంగా ఆ పిచ్ ఇప్పటికే కొంచం స్లో అయి ఉంటుంది కాబట్టి మన బ్యాట్స్మెన్స్ చాలా వరకు ఓపిక గా క్రీజ్ లో ఎక్కువ సేపు ఉండటానికి ట్రై చేయాలి. అది స్వతహాగానే స్పిన్ కి అనుకూలించే పిచ్ కావడం ఒకటి అయితే వర్షం కారణంగా బాల్ మనం ఎక్స్ పెక్ట్ చేసినట్టు గా రాదు కాబట్టి కొంచం నిదానం గా ఆడటమే బెటర్…ఇక మన బ్యాట్స్మెన్స్ లో ముఖ్యంగా మిడిలాడర్ లో ఆడే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య ముగ్గురు కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండగలిగితే ఆ పిచ్ ఆ టైం కి స్లో గా ఉన్న కూడా 50 ఓవర్లు ముగిసే సమయానికీ మనవాళ్ళు మంచి స్కోర్ అయితే చేయవచ్చు అలా కాకుండా మొదటి నుంచే హిట్టింగ్ కి దిగితే వీళ్లు కొట్టే షాట్స్ కరెక్ట్ గా కనెక్ట్ అవ్వక వికెట్లు పోయే అవకాశం కూడా ఉంటుంది.కాబట్టి స్టార్టింగ్ లో కొంచం స్లో గా ఆడి ఆ తర్వాత స్కోర్ ని పెంచే ప్రయత్నం చేయడం బెస్ట్ అప్షన్…
ఇక ఈ మ్యాచ్ లో గెలవడం కోసం ఇరు జట్లు కూడా చాలా ప్రయత్నాలే చేస్తున్నాయి.ఇక మన టీం అయితే బౌలింగ్ సైడ్ చాలా ఎక్కువగా ఎఫ్ఫార్ట్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది.అలాగే బ్యాటింగ్ లో కూడా ఓపెనర్లు ఎక్కువ సేపు ఆడాల్సిన అవకాశం కూడా ఉంది.చూడాలి మరి ఇండియా పాకిస్థాన్ మీద గెలిచి గొప్ప విజయాన్ని నమోదు చేస్తుందా లేదా అనేది…