మరీ రక్తం మరిగిన జంతువులు కూడా అతని అడుగుల చప్పుడుకు ఆదరిపోతాయి… ఈ డైలాగ్ రాధే శ్యామ్ లో ప్రభాస్ గురించి రాసింది. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవటం నేర్చుకున్న ఓ దొంగ కుమారుడే ఈ రాధే శ్యామ్. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి దేశ విదేశాల్లో ఓ స్థాయికి ఎదిగిన వ్యక్తి క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపిస్తున్నాడు. మొత్తంగా ప్రభాస్ ఈ సినిమాలో ఎంట్రప్రెన్యూర్ గా నటిస్తున్నాడట. అవసరమైతేనే జత కలవాలి బలం పెంచుకోవాలనే క్రియేటవివ్ బిజినెస్ మెన్ గా ఓ ఇన్నవేటివ్ థాట్ తో ప్రభాస్ ఒక క్యారెక్టర్ చేస్తుంటే.. మరో క్యారెక్టర్ లో రెగ్యులర్ మాస్ హీరోలా కనిపిస్తాడట. అంటే.. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో అలరించబోతున్నాడు.
Also Read: మూడో పెళ్లి చేసుకున్నా సుఖం లేదట !
మొత్తానికి ఈ సినిమా కథలో బోలెడంత నిగూఢార్ధం ఉందట. కొత్త కథలతో వచ్చే సినిమాల రిలీజ్ తరువాతే వాటి బాగోతం బయటపడుతుంది. కప్పేసే ప్రతీదీ మనల్ని మిస్ లీడ్ చేస్తుందన్నట్లు.. సినిమా స్టోరీ లైన్స్ కూడా అలానే అనిపిస్తాయి. ఏమైనా నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమాల స్టైల్ మారింది. యూనివర్సల్ సబ్జెక్ట్ లు తీసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు. కానీ, అవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయి అన్నదే పాయింట్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు అలాంటి కథలు ఎక్కవు. సాహో విషయంలో ఆ తప్పే జరిగింది. ఇప్పుడు రాబోయే సినిమాల్లో కూడా అదే రిపీట్ ఆయితే.. ఇక ప్రభాస్ కి తెలుగు మార్కెట్ తగ్గిపోయే అవకాశం ఉంది. మరి ప్రభాస్ ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమాలను ఫైనల్ చేసుకుంటే బెటర్.
Also Read: ‘పుష్ప’ స్టోరీ అదేనా!
ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటీవలే ఒక స్పెషల్ సెట్ ను వేయడానికి పూనుకున్నారు. త్వరలో జరగబోయే షెడ్యూల్ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా వన్ వీక్ షూటింగ్ జరగనుందని.. దాని కోసమే సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. మరి`జిల్` అనే ప్లాప్ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్టు అమ్మడు బికినీ అవతారంలో కనిపించనుంది ఈ సినిమాలో. నాలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.