Mirzapur Season 3 Review: మీర్జాపూర్ సీజన్ 3 ఫుల్ సిరీస్ రివ్యూ…

Mirzapur Season 3 Review: ముందుగా ఈ సీజన్ 3 కథ విషయానికి వస్తే రెండో సీజన్ లో మున్నా మరణంతో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే ఈ సీజన్ మొదలైంది.

Written By: Gopi, Updated On : July 5, 2024 3:53 pm

Pankaj Tripathi, Ali Fazal, Shweta Tripathi Sharma, Mirzapur Season 3 Review

Follow us on

Mirzapur Season 3 Review: బాలీవుడ్ నుంచి వచ్చిన సిరీస్ లలో మీర్జాపూర్ సిరీస్ సూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక ఈ సీరీస్ కి అన్ని భాషల ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకు రెండు సీజన్లు వచ్చాయి. ఇక మూడో సీజన్ కోసం అభిమానులందరు విపరీతంగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ సిరీస్ కూడా ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సీజన్ 3 ఎలా ఉంది. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కూడా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సీజన్ 3 కథ విషయానికి వస్తే రెండో సీజన్ లో మున్నా మరణంతో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే ఈ సీజన్ మొదలైంది. మొదట మున్నా అంత్యక్రియలతో ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది. అతని భార్య అయిన మాధురి (ఇషా తల్వార్) అంత్యక్రియల కార్యక్రమాలను చేపడుతుంది. ఇక అనంతరం ముఖ్యమంత్రిగా ఉన్న మాధురి ని కలవడానికి శరద్ శుక్ల వస్తాడు. అలాగే గతంలో ‘మీర్జాపుర్ ‘ పైన వీళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక అదే విధంగా ఇప్పుడు మళ్లీ మీర్జాపుర్ ను దక్కించుకోవాలి అంటే మనం అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని శరద్ శుక్ల చెబుతాడు…

దానికి ఆమె కూడా సరే అన్నట్టుగా సమాధానం ఇస్తుంది. ఇక ఇదిలా ఉంటే కాలీన్ భయ్యా భార్య అయిన బీనా త్రిపాఠి (రషిక దగల్) అండ తో మీర్జాపూర్ లో గుడ్డు భయ్యా సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ఇకమీదట తనదే హవా అంటూ గుడ్డు అక్కడున్న ప్రజలందరికీ తెలిసేలా చేస్తాడు… ఇక గోలు (శ్వేత త్రిపాఠి) గుడ్డు భాయ్ కి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఉంటూ మీర్జాపూర్ ను ఏలుతూ ఉంటారు. ఇక ఇదే సమయంలో శరద్ శుక్ల ,శత్రుజ్ఞ ఇద్దరు కూడా మీర్జాపూర్ సింహాసనం మీద దృష్టి సారిస్తారు.ఎలాగైనా సరే మీర్జాపూర్ సింహాసనాన్ని వాళ్ళు దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఇక మళ్లీ కాలీన్ భయ్యా తిరిగి వస్తాడు. దాంతో మీర్జాపూర్ సింహాసనం ఎవరికి దక్కింది అనేది తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు మిగతా రెండు సీజన్ల కంటే కూడా ఈ సీజన్ ని కొంతవరకు డల్ గా నడిపించినట్టుగా అనిపించింది. మున్నాభాయ్ లేకపోవడం ఈ సీజన్ కి మరొక మైనస్ గా మారిందనే చెప్పాలి. ఇక మొదటి మూడు సీజన్ల వరకు సిరీస్ మీద అసలు ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఏదో నడుస్తుంది కదా అంటే నడుస్తున్నట్టుగా సాగుతుంది. అలాంటి ఈ సీజన్ ని నాలుగోవ ఎపిసోడ్ నుంచి కొంతవరకు పిక్ అప్ చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ మీద భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులు కొంతవరకు నిరాశ చెందక తప్పదు. ఇక మొదటి రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ అవడంతో ఆటోమేటిగ్గా ఈ సీజన్ మీద మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వాటిని అందుకోవడంలో దర్శకుడు కొంతవరకు తడబడ్డాడు. కథని ఎలా నడిపించాలో తెలియక అక్కడక్కడ కొంత కన్ఫ్యూజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. నార్మల్ ఆడియన్స్ కంటే కూడా ఈ మీర్జాపూర్ సిరీస్ అభిమానులకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది.

ఇక మొత్తానికైతే సీజన్ 3 కోసం వెయిట్ చేసిన అభిమానులకు కొంత వరకు నిరాశ అయితే తప్పదు. నిజానికి మీర్జాపూర్ సిరీస్ అంటేనే వైలెన్స్ గత రెండు సీజన్లో కూడా దాని వల్లనే సక్సెస్ అయ్యాయి. కానీ ఇందులో వైలెన్స్ లేకుండా తీశారు అందుకే ప్రేక్షకులకు నత బాగా కనెక్ట్ కాలేదని కూడా చెప్పవచ్చు. ఇక ఈ సీజన్ మొత్తం గుడ్డు (అలీ ఫజల్) తన భుజాల మీద మోసాడనే చెప్పాలి. తన పాత్రలో ఉన్న ఇంటెన్స్ ని ఎక్కడ చెడగొట్టకుండా దర్శకుడు ఆయన పాత్రను మాత్రం మొదటి నుంచి చివరి వరకు చాలా కన్సిస్టెంట్ గా తీసుకొచ్చాడు. ఇక క్యారెక్టర్స్ ని బిల్డ్ చేసుకున్న విధానం బాగుంది. కానీ ఆ క్యారెక్టర్స్ ని మూవ్ చేసిన వే అసలు ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం వల్లే సీజన్ 3 అనేది ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉండాల్సింది జస్ట్ యావరేజ్ గా అనిపిస్తుంది…ఇక మొదటి 3 ఎపిసోడ్లు అయితే 45 నుంచి 50 నిమిషాలు డ్యూరేషన్ లో ఉన్నాయి. దానివల్ల సీన్ల మధ్య డ్యూరేషన్ పెంచడం కోసం సీన్లని మరీ సాగదీసారు. అది కూడా ఈ సీజన్ కి మైనస్ గా మారింది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అలీ ఫజల్ సీజన్ 3 కి హైలెట్ గా నిలిచాడు. మున్నా భయ్యా లేకపోవడం వల్ల ఆ బాధ్యత మొత్తాన్ని అలి ఫజల్ తీసుకుని సిటీస్ మొత్తాన్ని ముందుండి నడిపించాడు… ఇక శ్వేతా త్రిపాఠి కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా ఎక్స్ట్రాడినరీగా నటించి మెప్పించారు. ఇక కాలిన్ భయ్యా భార్యగా చేసిన రషీక దగల్ కొన్ని సీన్లలో పర్ఫెక్ట్ యాక్టింగ్ ప్రజెంట్ చేసే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు… ఇక ముఖ్యమంత్రిగా పోషించిన ఇషా తల్వార్ పాత్ర కూడా ఈ సిరీస్ కి కొంతవరకు ఓకే అనిపించింది. అంజుమ్ శర్మ మధ్య మధ్యలో మెరూపించాడు. ఇక విజయ్ వర్మ పాత్ర కూడా సిరీస్ కి ప్లస్ అయింది. ఆయన కనిపించింది కొద్దిసేపు అయిన కూడా తన పర్ఫెక్ట్ యాక్టింగ్ తో సిరీస్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే బ్యాగ్రౌండ్ స్కోర్ సిరీస్ కి ప్లస్ అయినప్పటికీ కొన్ని సీన్లలో అదే మైనస్ గా మారింది. సీన్ లలో కంటెంట్ లేకపోవడం వల్ల సీన్ ను డామినేట్ చేస్తూ బ్యాగ్రౌండ్ స్కోర్ అనేది సాగడం వల్ల ఆ సీన్ లో ఉన్న ఇంపాక్ట్ పోయి ఆ సీన్ లో ఏం చెప్పాలనుకున్నారో కూడా ప్రేక్షకుడికి అర్ధం కాకుండా పోయింది… ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే ఈ సీరీస్ ఒకే అనేలా ఉంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

అలీ ఫజల్ యాక్టింగ్
కొన్ని సీన్లు…

మైనస్ పాయింట్స్

కథ
మున్నా భయ్యా లేకపోవడం..
కొన్ని ఎపిసోడ్లు మరి సాగాదీసినట్లుగా ఉన్నాయి…

రేటింగ్
ఈ సిరీస్ కి మేమిచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్
మీర్జాపూర్ ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చుతుంది…