Mirai USA Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా…ఆ తర్వాత హీరోగా మారి పలు సినిమాలైతే చేశాడు. ఇక అందులో హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఇప్పుడు మిరాయి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈ సినిమా రేపు ఇండియాలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: కిష్కిందపురి ‘ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక వ్యక్తి కొన్ని శక్తులతో దేశాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే మిరాయి అనే అస్త్రం తో హీరో విలన్ ను ఎలా ఎదుర్కొన్నాడు. అతను చేసే అసాంఘిక కార్యకలాపాలను ఎలా ఆపాడు. దుష్ట శక్తులను ఎదిరించి దేశాన్ని ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా అని దర్శకుడు అయిన కార్తీక్ ఘట్టమనేని చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు సినిమాలో పెద్దగా ఆసక్తి గొలిపే అంశాలు ఏమీ లేకపోయినప్పటికి ఒక 30 మినిట్స్ తర్వాత నుంచి సినిమా ఊపందుకుందట. యూఎస్ఏ లో ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు సైతం తేజ సజ్జ యాక్టింగ్ అద్భుతంగా ఉందని స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు పాటించిన విధానమైతే ఎక్స్ట్రాడినరీగా ఉందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కారణం ఏంటి అంటే స్క్రీన్ ప్లే లో ఆయన డిఫరెంట్ మేలుకోలతో ఈ సినిమాని తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది.
ఇక గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా బాగా సెట్ అయిందని ఈ మూవీని చూసిన యూఎస్ఏ ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం… బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కడ తగ్గకుండా సినిమాకి హైప్ తెచ్చే విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బ్యా గ్రౌండ్ స్కోర్ చాలా వరకు హైలెట్ అయింది అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే తేజ సజ్జా చాలా అద్భుతంగా చేసినట్లుగా చెబుతున్నారు. విలన్ పాత్రలో మంచు మనోజ్ చాలా ఎక్స్ట్రాడినరీగా నటించినట్టుగా తెలుస్తోంది. ఇది తేజ సజ్జా మంచి మనోజ్ ఇద్దరు ఒకరికొకరు పోటా పోటీగా నటించి సినిమా మీద హైప్ తెచ్చారు. ఇక మిగితా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారట… ఇక శ్రేయ, జగపతిబాబు లాంటి నటులు సైతం వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించినట్టుగా తెలుస్తోంది…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయాల విషయానికీ మ్యూజిక్ ఒకే అనేలా ఉంది… బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది… విజువల్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కటి విజువల అందించారు…ఇక సీజి వర్క్ కూడా బాగుంది…