Kishkindhapuri Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ కథలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి అందులో భాగంగానే కొంతమంది దర్శకులు సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం డిజాస్టర్ లను అందిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘కిష్కిందపురి’ సినిమా ఈనెల 12 వ తేదీన రిలీజ్ అవుతున్నప్పటికి నిన్న నైట్ ఈ సినిమాకి ప్రీమియర్ షోలైతే వేశారు… మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
దెయ్యాల స్టోరీలు తెలుసుకోవడానికి దెయ్యాల మీద ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది రాఘవ అండ్ టీం కలిసి ఒక ప్లేస్ కి అయితే వెళ్తారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి దెయ్యాలు తిరిగే ఏరియా అని చెప్పి సువర్ణభూమి రేడియో స్టేషన్ అనే ప్లేస్ కైతే వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ టీం అక్కడ ఎదురైన ప్రాబ్లమ్స్ ని epa ఫేస్ చేశారు అనే విషయం తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు ఎక్కడ కూడా డివియెట్ అవ్వకుండా చాలా ఫ్రెష్ ఫీల్ తో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ దర్శకుడు ఈ సినిమాతో మరోసారి తన ఖాతాలో సక్సెస్ ను వేసుకున్నాడనే చెప్పాలి. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతోంది. అక్కడి నుంచి సినిమా మొత్తాన్ని ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు.
ఇక రైటింగ్ విషయంలో కూడా ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నాడు. హార్రర్ గొలిపే సన్నివేశాలు చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంగేజింగ్ గా వెళ్తే బాగుండు అనుకున్నప్పటికి అక్కడక్కడ కొంతవరకు తడబడ్డాడు. సెకండాఫ్ మీద దర్శకుడు ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటే బాగుండేది. అది రొటీన్ గానే ఉండడంతో ప్రేక్షకులు దానిని కొంతవరకు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ప్రతి సీన్ ను డైరెక్టర్ చాలా డిఫరెంట్ గాప్రజెంట్ అయితే చేశాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ సైతం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చాడు. మొత్తానికైతే ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకున్న విధానం అయితే బాగుంది… ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడా కూడా తగ్గకుండా ఇంతకుముందు వచ్చిన కొన్ని హార్రర్ సినిమాలను బీట్ చేసే విధంగా ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని కొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్థిక పర్ఫామెన్స్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చేయనటువంటి గొప్ప నటనను ప్రదర్శించే ప్రయత్న అయితే చేశాడు…ఇక ఈ సంవత్సరం ఇప్పటికే వచ్చిన భైరవం సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్న ఆయన ఈ సినిమాతో మాత్రం చాలా డీసెంట్ పర్ఫామెన్స్ ని ఇచ్చి సినిమా మీద అంచనాలైతే పెంచేశాడు… ఇక అనుపమ పరమేశ్వరన్ సైతం కొన్ని మేజర్ సన్నివేశాల్లో చాలా గొప్ప పర్ఫామెన్స్ ని ఇచ్చింది. ఆమె పర్ఫామెన్స్ వల్ల కూడా సినిమా మీద భారీ హైప్ అయితే పెరిగింది… హైపర్ ఆది కామెడీ పంచులు అక్కడక్కడ ఓకే అనిపించాయి. ఇక మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ మూవీ కి మ్యూజిక్ అందించిన చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఇక విజువల్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఇక విజువల్స్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా డీసెంట్ విజువల్స్ ని అందించారు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే అనిపించాయి…
ప్లస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించాయి
కొన్ని సీన్స్ కి లాజిక్స్ మిస్ అయ్యాయి…
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.5/5