Homeఎంటర్టైన్మెంట్Mirai Movie 10 Days Collections: 'మిరాయ్' పది రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. సరికొత్త...

Mirai Movie 10 Days Collections: ‘మిరాయ్’ పది రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. సరికొత్త బెంచ్ మార్క్ కి 3 కోట్లు మాత్రమే దూరం!

Mirai Movie 10 Days Collections: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) విడుదలై అప్పుడే పది రోజులు పూర్తి చేసుకుంది. పదవ రోజు ఆదివారం కావడంతో, ఈ చిత్రానికి ఆడియన్స్ మరోసారి థియేటర్స్ లో పోటెత్తారు. బుక్ మై షో గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి పదవ రోజున 91 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. చాలా మీడియం రేంజ్ సినిమాలకు ఈ […]

Mirai Movie 10 Days Collections: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) విడుదలై అప్పుడే పది రోజులు పూర్తి చేసుకుంది. పదవ రోజు ఆదివారం కావడంతో, ఈ చిత్రానికి ఆడియన్స్ మరోసారి థియేటర్స్ లో పోటెత్తారు. బుక్ మై షో గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి పదవ రోజున 91 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. చాలా మీడియం రేంజ్ సినిమాలకు ఈ రేంజ్ లో మొదటి రోజు కూడా అమ్ముడుపోవడం కష్టమే. అలాంటిది ఈ సినిమాకు పదవ రోజున కూడా ఈ రేంజ్ టికెట్స్ సేల్ అయ్యాయి. చూస్తుంటే ఓజీ వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే పది రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి పదవ రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 30 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈమధ్య కాలం లో ఒక మీడియం రేంజ్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు ఎప్పుడూ రాలేదు. అంతే కాదు ఓవర్సీస్ లో కూడా రెండవ వీకెండ్ ఈ చిత్రం మంచి గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకొని ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ లో 10 రోజులకు కలిపి 14 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 20 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర లో 4 కోట్ల 30 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 45 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో కోటి 50 లక్షలు, గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 7 లక్షలు, కృష్ణ జిల్లాలో 2 కోట్ల 30 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 67 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 123 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరో 5 కోట్ల రూపాయిల షేర్ ఎక్కువ రాబడితే ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper