Mirai movie break even: ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ(Teja Sajja) హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్'(Mirai Movie). సినిమాటోగ్రాఫర్ గా ఎంతో ప్రఖ్యాతి గాంచిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రీసెంట్ గానే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. సినిమా క్వాలిటీ వేరే లెవెల్ లో ఉన్నట్టుగా ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. ఒక కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టు, ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి కలిగించబోతున్నట్టుగా అనిపించింది ఈ థియేట్రికల్ ట్రైలర్. ట్రైలర్ ని చూస్తుంటే బడ్జెట్ భారీగానే పెట్టినట్టుగా కూడా అనిపించింది. కానీ ఆ చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ మాత్రం మా సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ పెంచడం లేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
సెప్టెంబర్ 12 న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది?, పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత వసూళ్లను రాబట్టాలి అనేది వివరంగా ఇప్పుడు మనం చూద్దాము. ‘హనుమాన్’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 175 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది కాబట్టి, ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ‘మిరాయ్’ కి జరిగింది అనుకుంటే పెద్ద పొరపాటే. కేవలం పాతిక కోట్ల రూపాయలకు మాత్రమే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇంత తక్కువ మొత్తానికి బిజినెస్ జరుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. రీసెంట్ గా విడుదలైన పెద్ద సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం తో బయ్యర్స్ దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే ఈ సినిమాకు ఇంత తక్కువ బిజినెస్ జరిగిందని అంటున్నారు.
మొదటి రోజు ఈ సినిమాకు యావరేజ్ గా ఉంది అనే టాక్ వచ్చినా సరే అవలీలగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం మొదటి రోజే తెలుగు రాష్ట్రాల నుండి పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తాయి. మరి డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఎలా తీర్చి దిద్దాడో చూడాలి. మార్కెట్ వేల్యూ ప్రకారం పాతిక కోట్ల రూపాయిల బిజినెస్ ని జరుపుకున్నప్పటికీ, నిర్మాత విశ్వప్రసాద్ కి బడ్జెట్ రీకవర్ అవ్వాలంటే కనీసం వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ క్యారక్టర్ లో నటించాడు. ట్రైలర్ లో చూస్తుంటే ఆయన క్యారక్టర్ ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉండేట్టుగా అనిపిస్తుంది. ‘భైరవం’ తో ఫ్లాప్ ని ఎదురుకున్న ఆయన, ఈ సినిమాతో ఎంతమేరకు కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.