Bigg Boss 9 Telugu Nominations: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మొదలై అప్పుడే రెండు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మూడవ వారం లోకి అడుగుపెట్టింది. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కారణంగా ఇప్పుడు స్టార్ మా ఛానల్ ఇండియా లోనే నెంబర్ 1 గా కొనసాగుతుంది అట. ఈ విషయాన్నీ స్వయంగా హోస్ట్ నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో తెలిపాడు. అయితే రెండవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇతను ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ గత వారం లో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆయన ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కి సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తి అయ్యింది. ఎప్పటి లాగానే ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ చాలా ఫైర్ వాతావరణం మధ్య జరిగింది.
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు ఎవరంటే, రీతూ చౌదరి, ప్రియా, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్, మరియు ఫ్లోరా షైనీ. వీరిలో లెక్క ప్రకారం అయితే ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవ్వాలి. కానీ సోషల్ మీడియా లో ఒక పెద్ద మిషన్ నడుస్తుంది. ఆ మిషన్ ఏమిటంటే ప్రియా ని ఎలిమినేట్ చేయడమే. యూట్యూబ్ లో ప్రతీ బిగ్ బాస్ కి వీడియో క్రింద ప్రియా ఎలిమినేట్ అవ్వాలి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెని ఎలిమినేట్ చెయ్యాలనే ప్రక్రియ లోనే ఫ్లోరా షైనీ ఈ వారం సేవ్ అయ్యింది. ఆమెకు ఎక్కువగా ఓట్లు వేస్తే ప్రియా డేంజర్ జోన్ లో వస్తుంది కాబట్టి, ఆమెని పంపేయొచ్చు అని అనుకున్నారు కానీ, ఈసారికి ఆమె మిస్ అయ్యింది.
Also Read: ‘బిగ్ బాస్ 9’ టాస్క్ లు బాగా ఆడే వాళ్లను ఎలిమినేట్ చేస్తున్నారా..? ఇదెక్కడి లాజిక్కు…
కానీ ఈ వారం కూడా అదే జరిగితే ఈమె కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది, టాస్కులు కూడా బాగానే ఆడుతుంది,కానీ ఆ బలుపు యాటిట్యూడ్ మాత్రమే ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో ఆమెకు చాలానే హింట్స్ వచ్చాయి. వాటిని అనుసరించి ముందుకు పోతే ఈమె సేవ్ అవుతుంది. లేదంటే ఈ వారం ఈమె సర్దుకోవాల్సిందే. అయితే న్యాయంగా చూసుకుంటే ఫ్లోరా షైనీ కచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఈ మిషన్స్ కారణంగా గత వారం లో లాగానే ఈ వారం కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి వారి ఏమి జరుగుతుందో. ఇకపోతే ఈ నామినేషన్స్ లో కూడా అనేక ట్విస్టులు ఉంటాయట. అవి ఏంటో నేటి ఎపిసోడ్ లోనే చూసి తెలుసుకోవాలి.