https://oktelugu.com/

Covid 19: కరోనా బారిన పడిన మాజీ మిస్ ఇండియా… మానస వారణాసి

Covid 19: కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తుంది.ఇప్పుడు తాజాగా మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కరోనా బారిన పడింది. ఆమెతో పాటు వివిధ దేశాలకు చెందిన పలువురు అందగత్తెలు కొవిడ్‌ బారిన పడడంతో మిస్ వరల్డ్ – 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్‌ ప్రకారం మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే నిన్న (డిసెంబర్ 16) ప్యూర్టోరికోలో జరగాల్సి ఉంది. అయితే ఫైనల్‌కు ముందే మానసతో పాటు మరికొందరు పోటీదారులు, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 02:39 PM IST
    Follow us on

    Covid 19: కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తుంది.ఇప్పుడు తాజాగా మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కరోనా బారిన పడింది. ఆమెతో పాటు వివిధ దేశాలకు చెందిన పలువురు అందగత్తెలు కొవిడ్‌ బారిన పడడంతో మిస్ వరల్డ్ – 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్‌ ప్రకారం మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే నిన్న (డిసెంబర్ 16) ప్యూర్టోరికోలో జరగాల్సి ఉంది. అయితే ఫైనల్‌కు ముందే మానసతో పాటు మరికొందరు పోటీదారులు, సిబ్బందితో కలిపి మొత్తం 17 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్తగా అందాల పోటీలను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని ఈవెంట్‌ ఆర్గనైజర్లు ప్రకటించారు.

    miss india 2020 manasa varanasi got covid positive

    Also Read: తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అనసూయ

    కాగా 23 ఏళ్ల మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా 2020 పోటీల్లో విజేతగా నిలిచింది. తద్వారా 70వ ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించింది. అయితే ఇంతలోనే కరోనా బారిన పడింది. కాగా ఈ అందాల రాణికి మన భాగ్య నగరంతోనూ అనుబంధం ఉంది. హైదరాబాదులో ఎఫ్ఐఐటీ జేఈఈలో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ… ఆ తర్వాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదివింది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒకరి తర్వాత మరొకరు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కరీనా కపూర్‌కు, షనయా కపూర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే.

    Also Read: చెక్​బౌన్స్​ కేసులో కోర్టు మెట్లెక్కిన హీరో సుమంత్​