Heroine: ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్.. కానీ ఆ తరువాత హీరోయిన్ పరిస్థితి ఏమైందో తెలుసా?

ఓ నటి మాత్రం ఒకే ఒక్క సినిమాతో చాలా ఫేమస్ అయింది. కానీ అందరూ అనుకున్నట్లు ఆమె బిగ్ స్టార్ కాలేకపోయింది. ఆ తరువాత అవకాశాలు రాక లోబడ్జెట్ నటించింది.. ఆ తరువాత టీవీ సిరియల్స్ లో నటిస్తోంది. అయితే ఆమె లేటేస్ట్ ఫొటోలు మాత్రం యూత్ ను బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి.

Written By: Srinivas, Updated On : July 8, 2024 5:07 pm

Minsara Kanna Movie Monica Castelino Current Status

Follow us on

Heroine: సినీ ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. అయితే ఈప్రపంచం బయట ఊహించినంతగా ఉండదు. ఎప్పుడు, ఎవరి జీవితం ఏ విధంగా మారుతుందో చెప్పలేం. ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వాళ్లు ఒక్క సినిమాతోనే స్టార్ అయిన వాళ్లు ఉన్నారు. అలాగే వందల కొద్ది సినిమాల్లో నటించినా గుర్తింపురాని వారూ ఉన్నారు. అయితే ఓ నటి మాత్రం ఒకే ఒక్క సినిమాతో చాలా ఫేమస్ అయింది. కానీ అందరూ అనుకున్నట్లు ఆమె బిగ్ స్టార్ కాలేకపోయింది. ఆ తరువాత అవకాశాలు రాక లోబడ్జెట్ నటించింది.. ఆ తరువాత టీవీ సిరియల్స్ లో నటిస్తోంది. అయితే ఆమె లేటేస్ట్ ఫొటోలు మాత్రం యూత్ ను బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇంతకీ ఎవరామె?

నార్త్ కు చెందిన చాలా మంది సౌత్ ఇండస్ట్రీలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కొందరు ఇక్కడే సెటిలైన వారు కూడా ఉన్నారు. ముంబయ్ కి చెందిన మోనికా కాస్టెలినో తమిళ ఇళయ దళపతి విజయ్ తో కలిసి ‘ఎతియా కన్న’ అనే సినిమా నటించింది.90వ దశకంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్టు కొట్టాయి. దీంతో ఇందులో నటించిన మోనికా ఒక్క సినిమాతోనే స్టార్ గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆమె సూపర్ స్టార్ అవుతారని అందరూ అనుకున్నారు.

కానీ ఆ తరువాత మోనికాకు అవకాశాలు రాలేదు. దీంతో అడల్ట్ మూవీ కామసుందరి సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఆ తరువాత విభిన్న ప్రాజెక్టుల్లో ఆకర్షణీయమైన పాత్రల్లో నటించింది. కొన్నాళ్లకు బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో కలిసి ‘మేరి ప్రతిజ్ఒ’ అనే సినిమాలో కనిపించింది. మెన్ నాట్ అలోడ్ అనే సినిమాలో స్వలింగ సంపర్క పాత్రను పోషించారు. అయితే ఈమె నటించిన సినిమాలు వరుసగా పరాజయం అయ్యాయి. దీంతో మరింత కుంగిపోయిన మోనికా చివరికి సీరియల్ పాత్రల్లో నటించడానికి ఒప్పుకుంది.

దీంతో మోనిక 2010 నుంచి టీవీ సీరియల్స్, ప్రత్యేక ప్రోగ్రాముల్లో నటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘డాక్టర్ మధుమతి ఆన్ డ్యూటీ, గప్ చుప్ వంటి ప్రోగ్రాముల్లో కనిపించి ఆకర్షించింది. ఆ తరువాత మోనికా సత్యప్రసాద్ అనే డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. అయితే లేటేస్ట్ గా ఆమె ఫొటోలను చూసి కుర్రకారు షాక్ అవుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ మోనికా అందం అలాగే ఉందని కొనియాడుతున్నారు.