
Prabhas Project K Release Date: ప్రభాస్ ప్రాజెక్ట్ కే చిత్రం మీద ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇండియాలోనే అతిపెద్ద యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ కోసమే చాలా సమయం తీసుకున్నారు. ఈ మూవీలో ఉపయోగించే ప్రతి వస్తువులు స్క్రాచ్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. ఆ మధ్య ఒక టైర్ డిజైన్ చేయడానికి ఎంత కసరత్తు జరిగిందో వీడియో రూపంలో చూపించారు. ఒక చిన్న టైర్ కోసం ఇంత తతంగం నడిపారంటే.. సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రాజెక్ట్ కే మూవీలో వాడే కార్ల ఇంజనీరింగ్ విషయంలో సహాయం చేయాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను దర్శకుడు నాగ్ అశ్విన్ కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇవన్నీ చూస్తుంటే ప్రాజెక్ట్ కే చిత్రాన్ని ఇండియన్ ఆడియన్స్ ఊహకు మించి తెరకెక్కిస్తున్నారని అర్థం అవుతుంది. ప్రాజెక్ట్ కే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని నాగ్ అశ్విన్ ఆల్రెడీ చెప్పారు. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అశ్వినీ దత్ నిర్మాతగా ఉన్నారు.

నేడు శివరాత్రి సందర్భంగా ప్రాజెక్ట్ కే మూవీ విడుదల తేదీ ప్రకటించారు. 2024 సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే విడుదల చేస్తునట్లు వెల్లడించారు. జనవరి 12న ప్రాజెక్ట్ కే వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెప్పిన సమయానికి డిలే చేయకుండా విడుదల చేయాలని కోరుకుంటున్నారు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి మేకర్స్ సగం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. దిశా పటాని మరొక హీరోయిన్. బర్త్ డే సందర్భంగా దీపికా పదుకొనె ప్రీ లుక్ విడుదల చేశారు. లేడీ వారియర్ గెటప్ లో ఆమె అద్భుతంగా ఉన్నారు. కాబట్టి రానున్న కాలంలో ప్రభాస్ వరుస రిలీజ్లతో హోరెత్తించనున్నారు. జూన్ లో ఆదిపురుష్ విడుదలవుతుంది. తర్వాత సెప్టెంబర్ లో సలార్ థియేటర్స్ లోకి వస్తుంది. మూడు నెలలకు 2024 జనవరిలో ప్రాజెక్ట్ కే విడుదల కానుంది.